Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఆ రోజు ‘పవన్‌’కి సపోర్టు చేస్తే… ఈ బాధ వచ్చేదా..!

ఆ రోజు ‘పవన్‌’కి సపోర్టు చేస్తే… ఈ బాధ వచ్చేదా..!

  • December 24, 2021 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ రోజు ‘పవన్‌’కి సపోర్టు చేస్తే… ఈ బాధ వచ్చేదా..!

ఈ లోకంలో ఎవరి గురించి ఎవరూ పోరాడరు… ఎవరి యుద్ధం వారిదే అని చెబుతుంటారు. అయితే ఒకరి గురించి మరొకరు పోరాడుతున్నారు అంటే… కచ్చితంగా ఆ వ్యక్తి నాయకుడే అవుతాడు. అలాంటి నాయకుణ్ని తక్కువ చేస్తే, ఆయనకు సపోర్టు ఇవ్వకపోతే… ఇక ఆ ప్రజల్ని, మనుషుల్ని ఇక ఎవరూ కాపాడలేరు. ఏంటీ భారీ డైలాగ్‌లు అనుకుంటున్నారా? డైలాగ్‌లు భారీగానే ఉండొచ్చు… ఎందుకంటే విషయం అంతకంటే భారీగా ఉంది కాబట్టి. మొత్తం కథనం చదివాక… ఆ రోజు ఆ ఒక్క చిన్న పని చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా అని మీకు కూడా అనిపిస్తుంది.

సరిగ్గా మూడు నెలల క్రితం అంటే సెప్టెంబరు 25న… సాయిధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. పవన్‌ వస్తున్నాడు కాబట్టి… కచ్చితంగా పొలిటికల్‌ కామెంట్స్‌ ఉంటాయని అందరూ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. అప్పటికే ఏపీలో టికెట్‌ రేట్లు, షోలు నిర్వహణ విషయంలో గరం గరం చర్చ జరుగుతోంది. అనుకున్నట్లుగానే పవన్‌ ప్రసంగం స్టార్ట్‌ చేశాడు. మధ్యలోకి వచ్చేసరికి ఏపీలో జగన్‌ ప్రభుత్వంపై సూటి విమర్శలు చేశాడు.

సినిమా టికెట్‌ ధరలు విషయంలో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న ఒంటెద్దు పోకడల్ని ఘాటుగా విమర్శించారు. దీనిపై టాలీవుడ్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెప్పాడు పవన్‌. అప్పటివరకు టికెట్‌ రేట్ల విషయంలో గొంతెత్తని టాలీవుడ్‌… పవన్‌ మాటలతోనైనా మూగనోము వీడుతుందేమో అనుకున్నారు. కానీ పవన్‌ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. నితిన్‌, కార్తికేయ లాంటి ఇద్దరు నటులు తప్ప మిగిలిన వాళ్లు స్పందించలేదు. దీంతో పవన్‌ ఆ సమయంలో ఒంటరివాడు అయపోయాడు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం నుండి పవన్‌పై దాడి మొదలైంది. పవన్‌ ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఆయనకే ఎందుకు ఈ కష్టం. మిగిలిన హీరోలకు సమస్య లేదా? అనే రీతిలో ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. అప్పటికీ మన సినిమా వాళ్ల మనసు కరగలేదు. పవన్‌కు సపోర్టు చేయాల్సింది పోయి… ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ ఓ కవరింగ్‌ డైలాగ్‌లు వదిలారు. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సంధి కుదిర్చే పని చేశారు తప్ప, సినిమా పరిశ్రమ భవిష్యత్తులో పడబోయే కష్టాల గురించి పట్టించుకోలేదు. నిర్మాతల పెద్దమనిషి దిల్‌ రాజు అండ్‌ టీమ్‌ పవన్‌ను కలసి విషయం సద్దుమణిగేలా చేశాయి.

ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి చూస్తే… తెలుగు సినిమాకు తెలంగాణలోను, పక్క రాష్ట్రాల్లోనూ, పక్క ఖండంలోను వసూళ్లు అద్భుతంగా వస్తున్నాయి తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో కాదు. టికెట్‌ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడో పది, పదిహేను ఏళ్ల క్రితం నాటి లెక్కలు తీసి, వాటిని ఇప్పుడు అమలు చేస్తుండటమే. ఈ లెక్క వల్ల ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే టికెట్‌ ధరల పెంచాల్సిందే అని సినిమా పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన పవన్‌కు సపోర్టు చేయలేదు.

ఇప్పుడు సినిమాలు విడుదల చేసి, వసూళ్లు లేవని బాధపడుతున్నారు. ఆ రోజు పవన్‌ గళమెత్తినప్పుడు, ఆలోచనలు మాని పవన్‌కు సపోర్టు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదా? ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఇప్పుడు సినిమాలు విడుదల చేసి, కుంటుతూ, కుంటుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. అందుకే పెద్దలు అంటారు. ఎదుర్కొనే ధైర్యం లేకపోతే, ఎదిరించేవాడి వెనుక ఉండాలి అని. వింటున్నారా సినిమా పరిశ్రమ పెద్దలూ.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Tollywood

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

47 mins ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

17 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

21 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

22 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version