టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో పొజిషన్‌కు పోటీ పడే స్టార్స్ లిస్ట్ లో మొన్నటి వరకూ బన్నీ చివరి ప్లేస్ లో ఉండేవాడు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ పేర్లు మాత్రమే ముందుండేవి. చివర్లో అల్లు అర్జున్ ఉండేవాడు. కానీ ఈ ఏడాది వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పాన్ ఇండియా సినిమా కాకపోయినా.. బన్నీకి ఆ స్థాయి హిట్ ఇచ్చింది. దాంతో బన్నీ కూడా నెంబర్ వన్ రేసులో ఉన్నట్టు నిరూపించుకున్నాడు. ఇది పక్కన పెడితే తాజాగా టాలీవుడ్లో.. అత్యధిక ప్రజాదరణ పొందిన స్టార్స్ లిస్ట్‌ను ‘ఓర్‌మ్యాక్స్’ సంస్థ రిలీజ్ చేసింది.

మన హీరోలు పది మంది ఉన్న ఈ లిస్ట్‌లో బన్నీ నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు. తరువాతే మహేష్ బాబు, ప్రభాస్ లు ఉన్నారు. ఇక చరణ్ అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల కొత్త సినిమాలు చేయలేకపోవడం వల్ల అనుకుంట.. విజయ్ దేవరకొండ, నాని ల కంటే వెనుక ఉన్నాడు. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఏ ప్లేస్ లో నిలిచారో ఓ లుక్కేద్దాం రండి :
1) అల్లు అర్జున్

2) మహేష్ బాబు

3) ప్రభాస్

4) పవన్ కళ్యాణ్

5) ఎన్టీఆర్

6) విజయ్ దేవరకొండ

7) నాని

8) రాంచరణ్

9) చిరంజీవి

10) వెంకటేష్

అయితే ఈ లిస్ట్ లో నాగార్జున, బాలకృష్ణ, నాగ చైతన్య వంటి హీరోలకు ప్లేస్ దక్కకపోవడం గమనార్హం.

Most Recommended Video
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే
