Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » లేడీ గెటప్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన హీరోలు

లేడీ గెటప్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన హీరోలు

  • May 27, 2016 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లేడీ గెటప్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన హీరోలు

సినీ హీరోలు కథను ఓకే చెయ్యాలంటే అది తమ అభిమానులకు ఎంత వరకు నచ్చుతుందో ఆలోచిస్తారు. తమ ఇమేజ్ కి ఇబ్బంది కలిగించే సన్ని”వేషాలుంటే” తీసేస్తారు. అలాంటిది ఆడవేషంలో కనిపించాలంటే జంకుతారు. లేడి గెటప్ లో ఎలా కనిపిస్తామేమోనని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటారు. కొందరు మాత్రం ఆ వేషం కథకు తప్పని సరి అనుకుంటే సాహసం చేస్తున్నారు. ఇలా హీరోలు అమ్మాయిలా కనిపించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించాయి.

భామనే .. సత్య భామనేKamal Haasan, Bhamane Satyabhamaneవిశ్వనటుడు కమల్ హాసన్ తన నటనతో ప్రపంచ సినీ అభిమానులనూ అలరించారు. ఆయన ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. మధ్య వయసు స్త్రీ గా “భామనే .. సత్య భామనే” చిత్రంలో కమల్ కనిపించారు. మనస్పర్ధలతో కమల్, మీనా విడిపోతారు. మీనా వద్ద ఉన్న కూతురుని చూడకుండా ఉండలేక కమల్ ఈ వేషం వేస్తారు. నవ్వులు పూయించారు. చివరకు ఆలుమగలు కలిసిపోయి కూతురికి మంచి తల్లిదండ్రులుగా నిలుస్తారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

చంటబ్బాయిChiranjeevi, chantabbaiచిరంజీవి హాస్య చిత్రాల్లో చంటబ్బాయి ఒకటి. ఇందులో చిరు డిటెక్టివ్ గా చేసే హడావుడి అంత ఇంత కాదు. సుహాసినిని అనుసరించే క్రమంలో వచ్చే “నేనో ప్రేమ పూజారి” అంటూ పాట అందుకుంటారు. ఈ పాటలో మెగాస్టార్ ఒక నిముషం పాటు అమ్మాయిగా కనిపిస్తారు. తెల్లగౌనులో అందమైన యువతిలా కనువిందు చేశారు. మహిళా ప్రేక్షకులు పడి పడి నవ్వారు. కనక వర్షం కురిపించారు.

చిత్రం భళారే విచిత్రంNaresh, Chitram Bhalare Vichitramబ్యాచిలర్ కి అద్దె ఇల్లు దొరకడం కష్టంగా ఉండడంతో .. రాజాగా ఉన్ననరేష్ ప్రేమగా వేషం వేస్తారు. మరింత కష్టాల్లో పడతారు. సుధాకర్ భార్యగా తిప్పలు పడుతూ హాస్యాని పండించారు. 1991 లో వచ్చిన చిత్రం భళారే విచిత్రం లో నరేష్ నటన సినిమా వంద రోజులు పండగ చేసుకోవడానికి దోహదం చేసింది. ఈ చిత్రానికి నరేష్ నంది అవార్డ్ కూడా అందుకున్నారు.

మేడమ్Rajendra Prasad, Madamనట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మేడమ్ సినిమాలో మేడమ్ సరోజినీ వేషం వేశారు. ఒకటి రెండు నిముషాల్లో లేడీ గా నటించడమంటే పెద్ద ప్రాబ్లం ఉండదు. టైటిల్ రోల్ పోషించడం అంటే కత్తి మీద సాములాంటిదే. ఈ సాహసంలో రాజేంద్ర ప్రసాద్ కూడా విజయం సాధించారు. ప్రసాద్, సరోజినీ, మందాకిని పాత్రలను చక్కగా పోషించారు. హిట్ కొట్టారు.

గంగోత్రిAllu Arjun, Gangotriకొన్ని సినిమాల్లో తమ నటనను ప్రూవ్ చేసుకున్నతర్వాత ఎవరైనా ఆడ వేషం వేయడానికి ముందుకొస్తారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తొలి చిత్రంలోనే విద్యార్ధినిగా కనిపించాడు. అమ్మాయిగా స్టెప్పులు వేసి ఆకట్టుకున్నాడు. గంగోత్రి సినిమాలో హీరోగా పరిచయమై ఒక పక్క పాటలు, ఫైట్ లతో అదరగొట్టి, మరో పక్క అమ్మాయిగా ఫన్ క్రియేట్ చేసాడు. విజయం అందుకున్నాడు.

పాండవులు పాండవులు తుమ్మెదManchu Manojమంచు విష్ణు, మంచు మనోజ్ నిర్మాతలగా శ్రీవాస్ తెరకెక్కించిన చిత్రం పాండవులు పాండవులు తుమ్మెద. ఇందులో మంచు మనోజ్ హాట్ భామ మోహినిగా కేక పుట్టించాడు. కైపు చూపులు, వయ్యారి నడకలతో సెక్సీ భామలకు పోటీ ఇచ్చాడు. సినిమా హిట్ కాక పోయిన మంచు మనోజ్ మోహినిగా కనిపించిన సీక్వెన్స్ లో థియేటర్ మొత్తం విజువల్స్ తో నిండిపోయింది.

పాండురంగడుBalakrishna, Pandurangaduనటసింహా బాలకృష్ణ భామగా ఒక సినిమాలో మెరిశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర దర్శకత్వంలో వచ్చిన పాండురంగడు సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తూనే కాసేపు అందాల సుందరిగా బాలకృష్ణ కనిపిస్తారు. బాలయ్య యువతిగా హొయలు పోతూ నడుస్తూ ఉంటే అభిమానులు విజిల్స్ వేయకుండా ఉండలేక పోయారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajendra Prasad
  • #Allu Arjun
  • #Balakrishna
  • #Bhamane Satyabhamane
  • #Chantabbai

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

6 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

6 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

7 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

19 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

2 days ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

2 days ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version