టాలీవుడ్ రాజకీయాలపై హీరో వ్యాఖ్యలు!

టాలీవుడ్ కుర్ర హీరో అరుణ్ ఆదిత్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ జంటగా ‘ప్రేమ దేశం’ అనే సినిమా తెరకెక్కింది. నవంబర్ 18న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విజయవాడలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అరుణ్ ఆదిత్ చేసిన కొన్ని కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ‘ప్రేమ దేశం’ సినిమా చేయడానికి విజయవాడకి చెందిన ఓ నిర్మాత తన దగ్గరకు వచ్చి.. అడ్వాన్స్ ఇచ్చారని..

వారం రోజులపాటు షూటింగ్ జరిగిన తరువాత.. అడ్వాన్స్ తిరిగిచ్చేయాలని, సినిమా చేయడం లేదని అన్నట్లు అరుణ్ ఆదిత్ తెలిపింది. అసలేం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని విషయాలు తెలిశాయని అన్నారు. ఇండస్ట్రీలో పాలిటిక్స్ జరిగాయని.. ‘బయట నుంచి వస్తున్నారా..? అలా వస్తే సినిమా ఎలా జరగనిస్తాం..? మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తాం. మీ రిలీజ్ ఆపించేస్తాం. థియేటర్స్ రాకుండా చేస్తాం. ఓటీటీ డీల్స్ జరగకుండా చేస్తాం. పబ్లిసిటీ చేయనివ్వం’ అంటూ కొందరు బెదిరించారని..

కానీ సంకల్పం ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తమ సినిమా షూటింగ్ ను ఎవరూ ఆపలేకపోయారని.. సినిమాను పూర్తి చేశామని అన్నారు. ఏకంగా నలుగురు ప్రొడ్యూసర్స్ కలిసి సినిమా చేశారని చెప్పారు. బాగా ఉన్నవాడు లేనివాడ్ని తొక్కడం అన్ని రంగాల్లో జరుగుతుంటుందని.. మనల్ని తొక్కాలని ప్రయత్నిస్తూనే ఉంటారని..

కానీ ఆగకుండా ముందుకు వెళ్లాలని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో నటి మధుబాల కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ సిద్ధం అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus