Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » తెలుగు మేటి యాంకర్లు

తెలుగు మేటి యాంకర్లు

  • May 25, 2016 / 10:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలుగు మేటి యాంకర్లు

టీవీ, యాంకర్లు. విడదీయలేని రెండు పదాలు. తెలుగు చానళ్ళు అవతరించిన తర్వాత మనకంటూ యాంకర్లు ఏర్పడ్డారు. వారి మాటలతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. సినిమాలో నటించే అవకాశాన్నిదక్కించుకుంటున్నారు. అంతే కాదు సినిమా ఆడియో వేడుకల్లోను తమ యాంకరింగ్ తో కట్టి పడేస్తున్నారు. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానళ్లలో వివిధ షోలలో కనిపిస్తూ మెరిపిస్తున్న మేటి యాంకర్ల గురించి..

మాటల మెషిన్ గన్ సుమAnchor Suma, Suma Kanakalaకేరళ నుంచి వచ్చి తెలుగు ఇంటి కోడలిగా మారి, తెలుగు వారు గొప్పగా చెప్పుకునే యాంకర్ గా ఎదిగిన స్టార్ మహిళా సుమ. బుల్లి తెరలో పాతికేళ్ళుగా అలుపు లేకుండా అలరిస్తున్న ఈమె ఈటీవీ స్టార్ మహిళా షో ద్వారా గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కేసింది. భలే చాన్సులే, క్యాష్ వంటి గేమ్ షోలలో స్పాంటే నియష్ గా కామెడి పండిస్తూ ముందుకు దూసుకు పోతోంది. పెద్ద హీరోల సినిమా ఆడియో రిలీజ్ వేడుకల్లో సుమ తప్పకుండా ఉంటుంది. ప్రొఫిషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని చక్కగా బ్యాలన్స్ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన మాటల యంత్రం సుమ.

బహుముఖ ప్రజ్ఞాశాలి ఝాన్సీAnchor Jhansiటాక్ అఫ్ ది టౌన్ అనే కార్యక్రమంతో ఝాన్సీ టీవీ ఇండస్టీ లో మంచి పేరు తెచ్చుకుంది. బ్రెయిన్ అఫ్ ఆంధ్ర, ఇండియన్, చెఫ్ నెంబర్ వన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయగల ఏకైక యాంకర్ ఝాన్సీ. ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే షో లకు తొలి ఆహ్వానం ఝాన్సీకే అందుతుందంటే అతిశియోక్తి కాదు. సినీ అవకాశాలను ఎక్కువగా అందుకున్న యాంకర్ కూడా ఝాన్సీ కావడం విశేషం. సింహ చిత్రంతో నంది అవార్డ్ సొంతం చేసుకున్నారు. పెన్ను పట్టి పత్రికల్లో వ్యాసాలు రాసారు. నిర్మాతగా మారి సినిమా తీసారు. ఇలా అనేక రంగాల్లో ప్రవేశించి విజయం సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఝాన్సీ.

టీఆర్పీ కింగ్ ఓంకార్Anchor Omkarడైరక్టర్ గా మారిన బుల్లి తెర యాంకర్ ఓంకార్. అతను చేసిన షోలకు అధిక టీఆర్పీ వస్తుంది. ఆట, చాలెంజ్ వంటి డాన్సు షోలు ట్రెండ్ సృష్టించాయి. మాయాద్వీపం, 100% లక్ లలో పిల్లలతోను, సెలబ్రిటీలతో సరదా ఆటలు ఆడించడం ఓంకార్ కే సాధ్యం. జీనియస్ సినిమా ద్వారా తొలిసారి మెగా ఫోన్ పట్టాడు. రాజు గారి గది సినిమా ద్వారా హిట్ కొట్టాడు. తనకు బుల్లితెర, వెండి తెర రెండు కళ్లు అని చెప్పే యాంకర్ & డైరక్టర్ ఓంకార్ రాజు గారి గది సీక్వెల్ కథ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

హృదయాలను గెలిచిన ఉదయ భానుAnchor Udaya Bhanuహృదయాంజలి అంటూ జనాల్లోకి వెళ్లి వాళ్ల హృదయాలను గెలుచుకున్నయాంకర్ ఉదయ భాను. వన్స్ మోర్ ప్లీజ్ షో తో పాపులర్ అయ్యింది. డింగ్ డింగ్ డుగాడుగా వంటి డాన్సు షోలకు యాంకరింగ్ చేయడమే కాదు సినిమాల్లో డాన్సు చేసింది. లీడర్, జులాయి వంటి స్పెషల్ సాంగ్లో డాన్సు ఇరగదీసింది.

పక్కింటి అబ్బాయి ప్రదీప్Anchor Pradeep Machirajuస్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు మరో రూపం ప్రదీప్. పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూ అందరికి దగ్గరయ్యాడు. గడసరి అత్త సొగసరి కోడలు షోతో నంది అవార్డు అందుకున్నాడు. తను నిర్మాత మారి యాంకరింగ్ చేస్తున్న షో “కొంచెం టచ్ లో ఉంటే చెబుతా” విశేషంగా ఆకట్టుకుంది. 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది సినిమాల్లోనూ నటించాడు. ప్రస్తుతం కిక్ షో చేస్తున్న ఇతనికి అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆంటీల్లో కూడా. తమ కూతురుకి ప్రదీప్ లాంటి అబ్బాయి కావాలని, రావాలని కోరుకుంటున్నారు.

షో పేరే ఇంటి పేరుగా మార్చుకున్న స్వాతిColors Swathiస్వాతి యాంకర్ గా బుల్లితెరలో ప్రవేశించి వెండి తెర పై వెలిగింది. ఆమె కలర్స్ షో చాలా ఆకట్టుకుంది. అప్పటినుచి ఆమెను కలర్స్ స్వాతిగా పిలుస్తున్నారు. అష్ట చెమ్మా, గోల్కొండ స్కూల్, స్వామీ రారా, త్రిపుర సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది. తన హస్కీ వాయిస్ తో అప్పుడప్పుడు పాటలు కూడా పాడి మెప్పించింది.

బుల్లితెర టామ్ అండ్ జెర్రీAnchors Ravi Laasyaలాస్య : కాలేజీ చదువుతూ పార్ట్ టైమ్ గా యాంకరింగ్ చేయడానికి వచ్చిన అమ్మాయిలా ఉంటుంది లాస్య. అమాయకత్వమే ఆమె ప్లస్ పాయింట్. సంథింగ్ స్పెషల్, మా ఊరి వంట, డీ జూనియర్స్ కార్యక్రమాలతో ఆకట్టుకుంది.

రవి : లాస్య, శ్రీముఖి వంటి యాంకర్లపై సెటైర్లు వేస్తూ స్టైల్ గా యాంకరింగ్ చేస్తుంటాడు. సినీ హీరో లాంటి అందంతో అమ్మాయిల్లో ఫాలోయింగ్ సంపాదించాడు.

అందమైన ఆంటీ అనసూయAnchor Anasuya, Anasuya Bharadwajఒక సినీ తారను చూసినప్పుడు కనిపించే వెలుగు అనసూయను చూసినప్పుడు అబ్బాయిల మొహంలో కనిపిస్తుంది. అమ్మాయిలకు సైతం అసూయ కలిగించే అందం ఈ ఆంటీ సొంతం. జబర్దస్త్, మా మహా లక్ష్మి, పిల్లలు పిడుగులు, బూమ్ బూమ్ షోలతో దూసుకు పోతోంది. క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టింది.

హాట్ యాంకర్ రష్మీRashmi Gautam, Anchor Rashmiఅనసూయ జబర్దస్త్ నుంచి బయటికి పోవడం రష్మీ ఫామ్ లోకి రావడానికి ఉపయోగడింది. పదేళ్లుగా ఫీల్డ్ లో ఉన్నా రాని పేరు ఈ షో ద్వారా వచ్చింది. తడబడుతూ తెలుగు మాట్లాడుతూ.. హాట్ హాట్ గా కనిపిస్తూ .. యూత్ హాట్ టాపిక్ లో ఉంటుంది. గుంటూర్ టాకీస్ తో హాట్ హాట్ గా కనిపించి మరిన్ని సినిమా చాన్స్ లు కొట్టేసింది.

మెగా యాంకర్ నిహారికNiharika Konidela, Niharika గలగల నవ్వులు.. అవుట్ స్టాడింగ్ ఎనర్జీ కలిసిన కొణెదెల వారసురాలు నిహారిక. చేసింది రెండు షోలే అయినా ఆడమగ, చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరికీ దగ్గరయ్యింది. ముద్ద పప్పు ఆవకాయతో నెటిజన్లు పడేసింది. ఇప్పుడు ఒక మనసు సినిమా ద్వారా మెగా అభిమానులను అలరించడానికి వచ్చేస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Jhansi
  • #Anchor Omkar
  • #Anchor Pradeep Machiraju

Also Read

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Delhi Crime 3 Review in Telugu: ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Suma Kanakala: “ఏంటి వీళ్లు విడిపోలేదా?”.. ట్రోల్స్‌కు సుమ పర్ఫెక్ట్ కౌంటర్!

Suma Kanakala: “ఏంటి వీళ్లు విడిపోలేదా?”.. ట్రోల్స్‌కు సుమ పర్ఫెక్ట్ కౌంటర్!

ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

trending news

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

13 mins ago
The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

1 hour ago
Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

2 hours ago
Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

Love OTP Review in Telugu: లవ్ OTP సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

Rajinikanth: రజినీ కమల్ మూవీ.. ‘ఫామ్‌లో లేని’ డైరెక్టర్‌తో రిస్క్ చేస్తారా?

2 hours ago
The Girlfriend: ‘చున్నీ’ వివాదం.. అది స్టంట్ కాదు: రాహుల్ రవీంద్రన్ క్లారిటీ

The Girlfriend: ‘చున్నీ’ వివాదం.. అది స్టంట్ కాదు: రాహుల్ రవీంద్రన్ క్లారిటీ

2 hours ago
IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

IBomma: ‘ఐబొమ్మ’ దొంగ దొరికాడు.. బ్యాంక్ అకౌంట్లో ఆ డబ్బు మొత్తం సీజ్!

2 hours ago
AA22XA6: అట్లీకి బన్నీ ‘డెడ్‌లైన్’.. ఆ దర్శకుడి కోసమేనా?

AA22XA6: అట్లీకి బన్నీ ‘డెడ్‌లైన్’.. ఆ దర్శకుడి కోసమేనా?

19 hours ago
Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ ఫస్ట్ సింగిల్ రివ్యూ.. ‘భమ్ అఖండ’ కి కొనసాగింపులా..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version