టాప్ 10 సెన్సేషనల్ టీజర్స్ ఇవే!

ఆ రోజుల్లో అంటే సినిమా విడుదల అవుతుంది అంటే నేడే చూడండి, నేడే చూడండి అంటూ రిక్షాలతో ప్రచారం చేసేవారు. అయితే రిక్షాల కాలం నుంచి ఆన్‌లైన్ రికార్డుల కాలానికి ఎదిగిన మనం సినిమా బడ్జెట్ నుంచి సినిమా బిజినెస్ వరకూ ఎన్నో మార్పులు చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పటి విషయం పక్కన పెడితే ఇప్పుడు టీజర్స్, ట్రైలర్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఇవే సినిమాను డిసైడ్ చేసే పరికరాలుగా మారాయి. అయితే ఈరోజుల్లో సినిమా విడుదలకు ఉన్నంత హైప్ సినిమా టీజర్స్ కి కూడా ఉండడంతో అభిమానులందరూ వాటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఇక సౌత్ ఇండియాలో తాజాగా విడుదలయిన టీజర్స్ లో తొలి 24గంటల్లో యూట్యూబ్ ని షేక్ చేసిన మొదటి తొలి టీజర్స్ ఏవో ఒకసారి చూద్దాం రండి….

సాహో (తెలుగు)సౌత్ ఇండియా లో తొలి 24గంటల్లో 2.2 మిలియన్ మంది వీక్షించిన ట్రైలర్ గా సహో నిలిచింది. బాహుబలి లాటి భారీ హిట్ తరువాత ఈ సినిమా వస్తూ ఉండడంతో అనేక అంచనాల నడుమ ఈ సినిమా టాప్10గా స్థానం పొందింది. ఇక ఈ సినిమాని సుజిత్ అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తూ ఉండగా…దాదాపుగా 150కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుంది.

తేరి (తమిళ్)ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన తేరి తమిళ సినిమా ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత కలైపులి థను నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సీబీఐ ఆఫీసర్ గా కనిపించాడు. ఇక భారీ అంచనలతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 2.3 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్9వ స్థానం పొందింది.

డీజె (తెలుగు)స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న డీజెపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తొలిసారి బ్రాహ్మణ పాత్రలో కనిపించనున్న బన్నీని చూసేందుకు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు మన వాళ్ళు. ఇక ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 2.3 మిలియన్ మంది చూడటం విశేషం. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా టాప్8వ స్థానం పొందింది.

ఖైదీనంబర్ 150 (తెలుగు)మెగా స్టార్ చిరంజీవి దాదాపుగా 9ఏళ్ల తరువాత మళ్లీ సినిమా చెయ్యడంతో ఆయన రాక కోసం ఎదురు చూసిన అభిమానులు ఆయన సినిమా టీజర్ కోసం చాలా ఆతురతగా ఎదురు చూశారు. అయితే అదే క్రమంలో ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 2.7 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్7వ స్థానం పొందింది. సినిమా విషయమే తీసుకుంటే మంచి హిట్ అందుకుంది.

ఎస్-3 (తమిళ్)ప్రముఖ తమిళ నటుడు సూరియా తన యముడు సినిమాకి సీక్వెల్ గా నటించిన ఎస్3 సినిమా పై భారీ అంచనలు నెలకొన్నాయి అప్పట్లో. అయితే ఇప్పటికే ఈ సీక్వెల్ రెండు సార్లు హిట్ అవడంతో మూడో సీక్వెల్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక అదే ఊపులో ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 2.74 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్6వ స్థానం పొందింది.

భైరవ (తమిళ్)ప్రముఖ తమిళ హీరో విజయ్ నటించిన భైరవ తమిళ సినిమా ప్రముఖ దర్శకుడు భారతన్ తెరకెక్కించాడు. ప్రముఖ నిర్మాత భారతీ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో విజయ్ బాంక్ ఏజెంట్ గా కనిపించాడు. ఇక భారీ అంచనలతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 2.85 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్5వ స్థానం పొందింది.

కాటమరాయుడు (తెలుగు)పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంచ కట్టుతో రాయలసీమ యాసతో కాటమరాయుడు సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అయితే సినిమా రిసల్ట్ అనుకున్నంత హిట్ కాకపోయినా, సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు ఆయన ఫ్యాన్స్. ఇక భారీ అంచనలతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 3.7 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్4వ స్థానం పొందింది.

కబాలి (తమిళ్)తమిళ సూపర్ స్టార్ భారీ అంచనాల నడుమ తెరకెక్కిన కబాలి సినిమా ఫలితం శూన్యం అయినా…సినిమా కోసం ఆయన అభిమానులు ఏడు చూసిన చూపులు మాత్రం మాటల్లో వర్ణించలేము. సినిమా ఫర్స్ట్ లుక్ కే భారీ క్రేజ్ ను సంతరించుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయి, ఇక అదే ఊపులో ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 5.1 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్3వ స్థానం సంపాదించుకుంది.

వివేగం (తమిళ్)తమిళ టాప్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వివేగం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్న అజిత్ ను చూస్తుంటే ఈ సినిమా మంచి యాక్షన్ థ్రిల్లర్ ని చెప్పక తప్పదు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం అజిత్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న క్రమంలో ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 6.09 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్2వ స్థానం సంపాదించుకుంది.

స్పైడర్ (తెలుగు)కొత్తదనం కోసం ఆరాటపడే నటుల్లో ఒకరైన ప్రిన్స్ మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా గురించి ఇప్పుడు ప్రతీ చోట చర్చ జరుగుతూనే ఉంది. అయితే అదే క్రమంలో కొత్తదనానికి కవర్ పేజ్ గా మారి, దసరా బరిలో దిగనున్న స్పైడర్ ఫర్స్ట్ లుక్ ఒక సంచలనం కాగా, ఇక స్పైడర్ టీజర్ యూ ట్యూబ్ లో క్రియేట్ చేసిన రికార్డులకు లెక్కే లేదు, అయితే సినిమా ఫర్స్ట్ లుక్ కే భారీ క్రేజ్ ను సంతరించుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయి, ఇక అదే ఊపులో ఈ సినిమా టీజర్ ను తొలి 24 గంటల్లో 6.3 మిలియన్ మంది చూడటం విశేషం. ఇక ఈ సినిమా టాప్ స్థానం సంపాదించుకుని సౌత్ ఇండియా లోనే టాప్ వ్యూడ్ టీజర్ గా రికార్డ్ సృష్టించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus