కోవిడ్ వల్ల సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసిన సమస్యలు ఎలా ఉన్నా. కోవిడ్ ముగిశాక సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటుందా? వంటి ప్రశ్నలు అందరినీ వెంటాడాయి. ఎందుకంటే.. ఆ టైంలో ప్రేక్షకులంతా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. మరోపక్క నిత్యావసరాలు పెరిగిపోవడంతో థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటానికి ప్రేక్షకులెవ్వరూ.. ఇంట్రెస్ట్ చూపలేదు. ఆ టైంలో హీరో (Star Heroes), హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకోవాలంటూ దర్శకనిర్మాతలు విజ్ఞప్తి చేశారు. అందుకు చాలా మంది హీరోలు (Star Heroes) అంగీకరించారు కూడా..! అయితే కోవిడ్ తర్వాత తక్కువ టైంలో కోలుకున్నది..
టాలీవుడ్ అనే చెప్పాలి. ‘పుష్ప’ (Pushpa) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. అందువల్ల మళ్ళీ హీరోలంతా పారితోషికాలు పెంచడం పై దృష్టి పెట్టారు. ఈ 3 ఏళ్లలో స్టార్ హీరోల పారితోషికాలు ఆకాశాన్నంటాయి అని చెప్పాలి. కోవిడ్ టైంకి రూ.50 కోట్లకి అటు ఇటుగా ఉన్న స్టార్ హీరోల పారితోషికాలు ఇప్పుడు వంద కోట్ల మార్క్ ను దాటేశాయి. 2024 టైంకి గాను మన స్టార్ హీరోల (Star Heroes) పారితోషికాల లెక్కలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి :
1) ప్రభాస్ :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) కోసం రూ.125 కోట్లు పారితోషికం అందుకున్నారట. ఇప్పుడు ఆయన రేంజ్ రూ.200 కోట్లకి దగ్గర పడినట్టు సమాచారం.
2) అల్లు అర్జున్ :
‘పుష్ప 2’ (Pushpa 2) కోసం దాదాపు 3 ఏళ్ళు కేటాయించాడు అల్లు అర్జున్ (Allu Arjun) . దీంతో అతను పారితోషికంగా రూ.150 కోట్లు అనుకుంటున్నట్లు సమాచారం. హిందీ రైట్స్ రూపంలో వచ్చే మొత్తంలో కొంత శాతం అల్లు అర్జున్ కి పారితోషికంగా ఇస్తున్నారట.
3) జూ.ఎన్టీఆర్ :
‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తో ఎన్టీఆర్ కి (Jr NTR) పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అందుకే అతను కూడా పారితోషికం పెంచేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. ‘వార్ 2’ కి గాను హృతిక్ రోషన్ (Hrithik Roshan) కంటే కూడా ఎన్టీఆర్ పారితోషికమే ఎక్కువ అని బాలీవుడ్ మీడియా టాక్.
4) మహేష్ బాబు :
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రానికి రూ.65 కోట్లు పారితోషికం అందుకున్నాడు మహేష్ బాబు (Mahesh Babu) . రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం అతను రూ.80 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం.
5) పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్నా.. ఆయన డిమాండ్ మాత్రం ఏమీ తగ్గలేదు. పవన్ ఓకే అంటే వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చేయడానికి దర్శకనిర్మాతలు రెడీగా ఉంటున్నారు. ప్రస్తుతం అతను చేస్తున్న ‘ఓజీ’ (OG Movie) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాల కోసం రూ.60 కోట్ల నుండి రూ.80 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట.
6) చిరంజీవి :
70 ఏళ్ళ వయసులో కూడా చిరంజీవి (Chiranjeevi) డిమాండ్ ఏమీ తగ్గలేదు. ఆయన సినిమాలకి ఇప్పటికీ రికార్డు ఓపెనింగ్స్ వస్తున్నాయి. దీంతో ఆయన కూడా పారితోషికంగా రూ.40 కోట్ల నుండి రూ.70 కోట్ల వరకు అందుకుంటున్నట్టు సమాచారం.
7) విజయ్ దేవరకొండ :
‘ఖుషి’ (Kushi) ‘ది ఫ్యామిలీ స్టార్’ (The Family Star) సినిమాల కోసం విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రూ.20 కోట్లు, రూ.25 కోట్లు పారితోషికం అందుకున్నట్టు వినికిడి. ఇప్పుడు చేస్తున్న సినిమాలకి అతను రూ.27 కోట్ల నుండి రూ.45 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. అతని మార్కెట్ ప్రకారం… విజయ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
8) నందమూరి బాలకృష్ణ :
‘అఖండ’ (Ahanda) వరకు పారితోషికం విషయంపై బాలకృష్ణ (Balakrishna) పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు.కానీ ఇప్పుడు ఆయన కుమార్తె తేజస్విని.. బాలయ్యకి మేనేజర్ గా వ్యవహరిస్తున్న తరుణంలో ఆయన రేంజ్ కి తగ్గట్టు రూ.30 కోట్లు డిమాండ్ చేస్తుందట. దర్శక నిర్మాతలు కూడా ఇందుకు ఓకే అంటున్నారట. ఇలా చూసుకున్న బాలయ్య పారితోషికం పెద్ద ఎక్కువేమీ కాదు.
9) నాని :
నేచురల్ స్టార్ నానితో (Nani) సినిమా అంటే సేఫ్ ప్రాజెక్టుగా భావిస్తున్నారు నిర్మాతలు. ప్రస్తుతం నాని రూ.25 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు. అతను అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఓకే అంటున్నారు.
10) రవితేజ :
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) సినిమాలు ఈ మధ్య వరుసగా ప్లాప్ అవుతున్నా.. అతని డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అతను రూ.30 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నప్పటికీ.. రూ.25 కోట్ల వరకు ఇవ్వడానికి నిర్మాతలు ఓకే అంటున్నారు.