డైరక్టర్ అంటే సినిమా అనే నావకు కెప్టెన్ వంటి వారు. అతనికి ప్రతిభతో పాటు ప్రతిభ ఉన్నవారిని గుర్తించగల నేర్పు ఉండాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో దాగిన ట్యాలెంట్ ని వెలికి తీసే గుణం ఉండాలి. నలుగురితో కలిసిపోయే తత్వం ఉండాలి. 24 క్రాఫ్ట్స్ పైన అవగాహన ఉండాలి. ఇంత నేర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే గతంలో డైరక్టర్ చైర్ లో కూర్చోవాలంటే కనీసం పది సంవత్సరాల పాటు సినిమా మేకింగ్ లో అనుభవం ఉండాలి. అప్పుడే నిర్మాతలు వారికి అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక సినిమాకు కూడా దర్శకత్వశాఖలో పనిచేయకుండానే నేరుగా మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. నేటి యువత నాడిని పట్టి బాక్స్ ఆఫీస్ ని కొల్లకొడుతున్నారు. అలా టాలీవుడ్ లో విజయాలను అందుకున్న టాప్ టెన్ యంగ్ డైరక్టర్స్ వీరే.