అప్పట్లో ఓ సినిమా రికార్డుల గురించి తెలుసుకోవాలి అంటే ఎన్ని రోజులు ఆడిందో? అడిగేవారు. తర్వాత సినిమా ఎన్ని సెంటర్లలో 50 రోజులు, వంద రోజులు ఆడిందని అడిగేవారు…? ఇప్పుడు మాత్రమే అలాంటి వాటికి కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు వంద రోజుల సినిమాలు లేవు.. 100కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు గురించే అడుగుతున్నారు.వాటి గురించే చెప్పుకుంటున్నారు?అయితే ఓ సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టాలి అంటే .. దానికి రిలీజ్ ముందు నుండీ హైప్ క్రియేట్ అవ్వాలి. అది ఎలా ఏర్పడుతుంది అనేది ఆ సినిమా యొక్క టీజర్, ట్రైలర్ లకు నమోదైన లైకులు, వీక్షణలను ఆధారం చేసుకునే చెప్పగలం. యూట్యూబ్ లో నమోదయ్యే ఈ రికార్డులని సదరు హీరో అభిమానులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు.
తద్వారా సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ నమోదవుతాయి అనేది వారి బలమైన నమ్మకం. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో ఎన్ని లైకులు, వ్యూస్ నమోదయ్యాయి అనేది చాలా కీలకమైన విషయం. దీన్ని బట్టి.. ఆ సినిమాకి హైప్ ఉందా? లేదా? బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా నిలబడుతుందా? లేదా? అనేది అంచనా వేయగలం. సరే ఇంతకీ.. 24 గంటల్లో ఎక్కువ లైకులు సాధించిన టాలీవుడ్ ట్రైలర్లు ఏంటి అనే విషయం పై ఓ లుక్కేస్తూ.. టాప్ 10 లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి – ఎన్టీఆర్ – రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభమైతే.. ట్రైలర్ గతేడాది అంటే 2021 డిసెంబర్ లో వచ్చింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే.. 1.24 మిలియన్ లైక్స్ నమోదయ్యాయి.
2) సర్కారు వారి పాట :
మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై రిలీజ్ కు ముందు చాలా హైప్ క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించడమే అని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 1.21 మిలియన్ లైక్స్ నమోదయ్యాయి.
3) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్లో ‘అయ్యప్పనుమ్ కోషియమ్'(మలయాళం) కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 1.11 మిలియన్ లైక్స్ నమోదయ్యాయి.
4) వకీల్ సాబ్ :
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 1.006 మిలియన్ లైక్స్ నమోదయ్యాయి. తెలుగు సినిమాల ట్రైలర్స్ లో మొదటి 1 మిలియన్ లైక్స్ నమోదైంది ఈ చిత్రం ట్రైలర్ కే అని చెప్పాలి.
5) పుష్ప(పుష్ప ది రైజ్) :
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూడో చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 893K లైక్స్ నమోదయ్యాయి.
6) ఆచార్య :
చిరంజీవి – రాంచరణ్ కాంబినేషన్లో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 838K లైక్స్ నమోదయ్యాయి.
7) కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 772.4K లైక్స్ నమోదయ్యాయి.
8) రాధే శ్యామ్ :
ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 590.2K లైక్స్ నమోదయ్యాయి.
9) లైగర్ :
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 561K లైక్స్ నమోదయ్యాయి.
10) బాహుబలి 2( బాహుబలి : ది కన్క్లూజన్) :
ప్రభాస్- రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 497K లైక్స్ నమోదయ్యాయి.
11) సాహో :
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 392K లైక్స్ నమోదయ్యాయి.
12) బింబిసార :
కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 367K లైక్స్ నమోదయ్యాయి.
13) అఖండ :
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 351K లైక్స్ నమోదయ్యాయి.
14) సరిలేరు నీకెవ్వరు :
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 347K లైక్స్ నమోదయ్యాయి.
15) లవ్ స్టోరీ :
నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ కి 24 గంటల్లో 342K లైక్స్ నమోదయ్యాయి.