ఓటీటీలకు ఈ సినిమాలు లాభం చేకూరుస్తాయా?

  • March 31, 2022 / 11:39 PM IST

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ఓటీటీల వినియోగం అంచనాలను మించి పెరిగింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు థియేటర్లలో సినిమాలు రిలీజైన మూడు నుంచి నాలుగు వారాల తర్వాత ఆ సినిమాలను ఓటీటీలలో అందుబాటులోకి తెస్తున్నాయి. థియేటర్లలో హిట్టైన సినిమాలు ఓటీటీలో కూడా సక్సెస్ సాధిస్తుండగా థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే ఓటీటీలో క్లిక్ అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు ఓటీటీలో ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

Click Here To Watch NOW

రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ యాప్ లో అందుబాటులోకి రానుంది. రాధేశ్యామ్ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో పాటూ అమెజాన్ ప్రైమ్ కు మంచి లాభాలను అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రిలీజైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మార్చి 4వ తేదీన థియేటర్లలో విడుదలై ఫ్లాపైన ఆడవాళ్లు మీకు జోహార్లు ఏప్రిల్ 2వ తేదీ నుంచి సోనీ లివ్ యాప్ లో అందుబాటులోకి రానుంది.

ఓటీటీలో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి. రాధేశ్యామ్ రిలీజ్ కు ఒకరోజు ముందు థియేటర్లలో విడుదలైన ఈటీ సన్ నెక్స్ట్ యాప్ లో ఏప్రిల్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రాధేశ్యామ్ విడుదలైన వారానికి థియేటర్లలో విడుదలైన స్టాండప్ రాహుల్ థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది. రాజ్ తరుణ్ కు జోడీగా వర్ష బొల్లమ్మ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమాగా తెరకెక్కిన జేమ్స్ మూవీ ఈ నెల 14వ తేదీ నుంచి సోనీ లివ్ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమాలు ఓటీటీలో అయినా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తాయేమో చూడాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus