Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » టాలీవుడ్ “ఖాకీ చొక్కా” కహాని

టాలీవుడ్ “ఖాకీ చొక్కా” కహాని

  • April 11, 2016 / 04:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టాలీవుడ్ “ఖాకీ చొక్కా” కహాని

ఒకప్పుడు పోలీస్ పాత్రలు కేవలం, హాలీవుడ్ పరిశ్రమకే పరిమితం అయ్యేవి. మన తెలుగు పరిశ్రమలో సైతం పోలీసు పాత్రలు ఉండేవే కానీ, హత్య జరుగాక ఇన్వెస్టిగేషన్ కోసమో, లేకపోతే క్లైమ్యాక్స్ లో విలన్ ని, హంతకుల్ని పట్టుకునేందుకో మన పోలీసు పాత్రలు ఉండేవి. అయితే అదంతా పాత తరం, అప్పటి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి, ఇప్పటి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకూ అందరూ పోలీసు పాత్రల్లో అదరగొడుతున్నారు. కొందరు హీరోలకైతే, ఆ ఖాకీ చొక్కా బాగా కలసి వచ్చింది అనే చెప్పాలి. ఇక ఖాకీ చొక్కా వేసి మన కధానాయకులు ప్రభంజనాలు సృష్టించినవి, లాఠీ పట్టి బ్లాక్ బస్టర్స్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి, మరి అలాంటి వాటిల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి…

విశ్వవిఖ్యాత ‘ఎన్టీఆర్’

Sr NTRఅన్నగారు తన కరియర్ లో ఎక్కువ సినిమాల్లో పోలీసు పాత్రలు వెయ్యనప్పటికీ, ఆయన ‘మన దేశం’ చిత్రంలో పోలీస్ పాత్రలో జీవించడమే కాకుండా, చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ లో సైతం రిటైర్డ్ ఆర్మీ జనరల్ గా కనిపించి అభిమానులనే కాదు, యావత్ ప్రేక్షకులను ఆయన నటనతో మంత్రముగ్దుల్ని చేశారు.

రాజశేఖర్ – సాయికుమార్

Sai kumarటాలీవుడ్ లో పోలీసు పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న హీరోల్లో సాయికుమార్,  రాజశేఖర్ ఇద్దరూ టాప్ ప్లేస్ లో ఉంటారు. రాజశేఖర్ ‘అంకుశం’ చిత్రం ఆయన కరియర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోగా, ఇక సాయికుమార్ ‘పోలీస్ స్టోరీ’ పోలీస్ పాత్రలకే మంచి పేరు తెచ్చిపెట్టింది.

మెగాస్టార్ ‘చిరంజీవి’

Chiranjeeviటాలీవుడ్ మెగాస్టార్ ‘చిరంజీవి’ సైతం తన కరియర్ లో ‘ఎస్పీ పరశురాం’ చిత్రంలో పోలీస్ పాత్రలో కనిపించి అభిమానుల్ని అలరించారు.

యువసామ్రాట్ ‘నాగార్జున’

Nagarjunaఅక్కినేని వారసుడు యువసామ్రాట్ నాగార్జున కూడా శివమణి చిత్రంలో పోలీసుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ఈ పోలీస్ ప్రేమ కధకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు.

విక్టరీ ‘వెంకటేష్’

Venkateshఫ్యామిలీ హీరోగా, కామెడీ టైమింగ్ తో తనదైన శైలిలో మెప్పించే వెంకీ సైతం తమిళ చిత్రం ‘ఖాకా…ఖాకా’ తెలుగు రీమేక్ లో ఖాకీ చొక్కా వేశాడు. తనదైన నటనతో, రఫ్ లుక్ తో, ఎనర్జెటిక్ బాడీ తో, దుమ్ము దులిపేసాడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ అందించిన ఈ పాత్రలో వెంకీ యాక్టింగ్ సూపరో సూపర్. సరికొత్త పాత్రలో వెంకీ అభిమానులని అలరించాడు.

నటసింహం ‘బాలకృష్ణ’

Balakrishnaతండ్రికి తగ్గ తనయుడిగా, బాలయ్య సైతం పోలీస్ పాత్రలో తన పవర్ ఏంటో చూపించాడు. తొడగొట్టి డైలాగ్ చెప్పినా, ఖాకీ డ్రెస్ లో విలన్ కు సవాల్ విసిరినా బాలయ్య స్టైలే వేరు. ‘లక్ష్మి నరసింహ’ సినిమాలో విలన్ దగ్గరే లంచం తీసుకుని, విలన్ కు సవాల్ విసిరే పాత్రలో బాలయ్య నటనకు అభిమానులే కాదు, యావత్ ప్రేక్షకలోకం బ్రహ్మ రధంపట్టింది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో సరికొటట్ రికార్డులకు శ్రీకారం చుట్టింది.

ప్రిన్స్ ‘మహేష్ బాబు’

Mahesh babuపోకిరి సినిమాతో ప్రిన్స్ మహేష్ పోలీస్ పాత్రలకే సరికొత్త రూపాన్ని అందించాడు. అండర్ కాప్ గా ఆయన నటన ఆ సినిమాలో అద్భుతం అనే చెప్పాలి. ఇక పోలీస్ పాత్రలో మహేష్ కేవలం చివరి అరగంట కనిపించి బాక్స్ ఆఫీస్ రికార్డులకు పట్టిన తుప్పును వదిలించాడు. ఇప్పటికీ ఈ చిత్రం 100రోజుల రికార్డును టచ్ చేసే హీరో లేడు అంటే అతిశయోక్తి కాదు.

పవర్ స్టార్ ‘పవన్ కల్యాణ్’

Pawan kalyanటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనేక పరాజయాల తరువాత ‘గబ్బర్ సింగ్’గా ప్రభంజనం సృష్టించాడు. ఒక పక్క పోలీస్ పాత్రకు న్యాయం చేస్తూనే, ఆ పాత్రతో ఎంటర్‌టేన్‌మెంట్ కూడా పండించి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ఇక ఆ సినిమాలో అంత్యాక్షరి సీన్ అయితే ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోరు, టీవీలో వస్తుంటే ఛానెల్ మార్చరు అంతటి హిట్ గా నిలిచింది.

స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’

Allu Arjunచివరకి మన అల్లు వారి అబ్బాయి, అల్లు అర్జున్ కూడా పోలీస్ పాత్రలో మెప్పించాడు. పూర్తి తరహా పాత్ర కాకపోయినా, నవ్వించే పోలీస్ గా బ్రహ్మీను అడ్డుపెట్టుకుని విలన్స్ బెండ్ తీసే పాత్రలో మన బన్నీ దుమ్ము దులిపేసాడు.

మాస్ మహారాజా ‘రవితేజ’

Ravi Tejaమన మాస్ మహారాజా రవి తేజ సైతం పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు. అందులో మన జక్కన్న రాజమౌళి సంధించిన ‘విక్రమార్కుడు’, అటుపై, కేఎస్ రవీంద్ర ‘పవర్’, సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’ లో పవర్‌ఫుల్ పోలీస్ మ్యాన్ గా మన రవి ఇరగదీశాడు.

నందమూరి ‘కల్యాణ్ రామ్’

Kalyan Ramఅనేక పరాజయాల తరువాత ‘పటాస్’ చిత్రంలో పోలీస్ పాత్రలో పవర్ ప్యాక్డ్ ఆక్టింగ్ తో ఆకట్టుకున్నాడు మన నందమూరి చిన్నోడు కల్యాణ్ రామ్. ఆ చిత్రంలో ఆతని పాత్ర, ఆ పాత్ర ప్రదర్శించే తీరు అద్భుతంగా ఉండడమే కాకుండా, హిట్ కోసం తహతహలాడుతున్న కల్యాణ్ రామ్ కు బ్లాక్ బస్టర్ అందించింది ఈ చిత్రం.

యంగ్ టైగర్ ‘ఎన్టీఆర్’

పవర్ ప్యాక్డ్ నటనకు కేర్ ఆఫ్ అడ్రెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో రంగంలోని దిగితే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. శక్తి, బాద్‌షా లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించిన ఎన్టీఆర్, ‘టెంపర్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ లోని పొగరుని ప్రేక్షకులకు అందించాడు. టెంపర్ లో ఎన్టీఆర్ నటనకు యావత్ ప్రేక్షకలోకం ఫిదా అయిపోయింది. చివర్లో కోర్ట్ సీన్ అయితే అద్భుతం అనే చెప్పాలి.

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’

Ram Charan‘జన్జీర్’ గా చెర్రీ సైతం అభిమానుల్ని పోలీస్ పాత్రలో అలరించాడు. ముంబైలోని పవర్‌ఫుల్ పోలీస్ పాత్రల్ చెర్రీ అభిమానులను తన నటనతో కట్టిపడేశాడు. ఇక ఆ చిత్రం తెలుగులో తుఫాన్ గా విడుదలయ్యి మంచి విజయం సాధించింది.

అలా యువ హీరోలందరూ పోలీస్ పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Dookudu
  • #Gabbarsingh

Also Read

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

related news

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

trending news

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

11 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

11 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

12 hours ago
Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

15 hours ago
Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

19 hours ago

latest news

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

14 hours ago
Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

15 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

20 hours ago
Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

20 hours ago
NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version