‘యానిమల్’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రాంగోపాల్ వర్మ, రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ల తర్వాత బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా నిలిచాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించింది. బాలీవుడ్లో రష్మికకి ఇదే మొదటి సక్సెస్. అయినప్పటికీ ఎక్కువ క్రెడిట్ అంతా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి డిమ్రి కొట్టేసింది.
జోయా అనే పాత్రలో (Triptii Dimri) ఈమె ‘యానిమల్’ లో చాలా బోల్డ్ గా నటించింది. ఓ సన్నివేశంలో బట్టలు లేకుండా రణబీర్ కపూర్ తో డీప్ ఇంటిమేట్ సీన్లో నటించి షాకిచ్చింది. దీంతో ఇండియా వైడ్ ఈమెకు అమాంతం ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఈమె గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :