స్టార్ హీరోలు కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించడం అనేది బాగా అరుదు. కానీ ఈ మధ్య కాలంలో వరుస మల్టీస్టారర్లు వస్తున్నాయి కాబట్టి.. లేదంటే పలు ఈవెంట్లకి గెస్ట్..లుగా వెళ్ళినప్పుడు అలా కలిసి కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నారు హీరోలు. హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఎక్కువగా కనిపించవు. దానికి కారణాలు ఏంటి అనేది తెలీదు. నిన్నటి తరం హీరోయిన్లు తప్ప.. ఇప్పటి హీరోయిన్లు కలిసి సందడి చేసిన సందర్భాలు ఎక్కువగా లేవు అనే చెప్పాలి.
అయితే ఈ లిస్టులోకి సీనియర్ హీరోయిన్లు త్రిష(Trisha), ఛార్మి చేరారు. ఇటీవల ఈ భామలు దుబాయ్ ట్రిప్ వేసి అక్కడ సందడి చేశారు. వాళ్ళతో కలిసి నికీషా పటేల్ కూడా సందడి చేసింది.దుబాయ్ లో ఉన్న బ్లూ వాటర్ ఐలాండ్ వేదికగా త్రిష, ఛార్మి, నికీషా పటేల్ రీ-యూనియన్ అయ్యారు. రూమ్లో ఆడుకుంటూ సరదాగా తీసుకున్న సెల్ఫీతో పాటు.. దుబాయ్ రోడ్లపై కూడా ఈ భామలు సందడి చేశారు. ఒక ఫొటోలో త్రిష.. ఛార్మికి ముద్దు పెడుతూ క్యూట్ ఫోజ్ ఇచ్చింది.

ఈ ఫోటోల్లో వీరి హ్యాండ్ బ్యాగ్లు కూడా హైలెట్ అయ్యాయి. అవి చాలా కాస్ట్లీ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక త్రిష, ఛార్మి.. ఇద్దరి కెరీర్ ఆల్మోస్ట్ ఒకే టైంలో స్టార్ట్ అయ్యింది. అయితే త్రిష అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ ఛార్మి ఆ హైట్స్ ని అందుకోలేదు. అయితే ప్రభాస్ ‘పౌర్ణమి’ సినిమాలో వీళ్ళిద్దరూ అక్కాచెల్లెళ్లుగా కలిసి నటించారు. అప్పటి నుండి వీళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది.
ఇక నికీషా పటేల్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’, కళ్యాణ్ రామ్ ‘ఓం 3D’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
