మెగాస్టార్ తో ఓకే అంటున్న భామలు..!

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమాకి ఇప్పుడు విపరీతమైన హైప్ క్రియేట్ అవుతోంది. రీసంట్ గా వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తున్న బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమా రైట్స్ కోసం కాచుకుని కూర్చున్నారు. అయితే, హిందీలో కూడా సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అంతేకాదు, సినిమాకి వస్తున్న హైప్ చూసి హీరోయిన్ త్రిష తెగ బాధపడిపోతోందట. అప్పుడు సినిమాలో ఛాన్స్ వచ్చినా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని తప్పుకున్న త్రిష ఇప్పుడు మెగాస్టార్ తో మరో ఛాన్స్ వస్తే చేస్తానని హింట్స్ ఇస్తోందట.

అప్పుడు వద్దంది.. ఇప్పుడు కావాలంటోందని అంటున్నారు సినీజనం. అయితే, ఇదే టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ కి రెడీ అయిపోయాడు. మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో హీరోయిన్ గా నయనతారని తీస్కోబోతున్నారు. ఇదే ప్లేస్ లో మొదట్లో త్రిష పేరు కూడా వినిపించిందని అయితే, ఆచార్య సినిమా చేయలేదని నయనతారపై మొగ్గుచూపినట్లుగా సమాచారం. నిజానికి మురుగదాస్ మెగాస్టార్ తో చేసిన స్టాలిన్ సినిమాలో నయనతారకి అవకాశం వచ్చింది. కానీ, అప్పుడున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ ఛాన్స్ ని పొగొట్టుకుంది ఈ భామ.

అప్పుడు ఆ సినిమాలో త్రిషకి ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మాత్రం మెగాస్టార్ తో ఛాన్స్ మిస్ చేస్కోవాలని అనుకోవడం లేదట నయన్. అందుకే ఎన్నోరోజులైనా సరే డేట్స్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. అంతేకాదు, ఆ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాకి కూడా నయన్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. అయితే, మోహర్ రమేష్ మాత్రం శృతిహాసన్ లేదా రకుల్ ప్రీత్ సింగ్ ని తీస్కోవాలని చూస్తున్నాడట. మొత్తానికి అదీ మేటర్.

Most Recommended Video
v
కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus