పవన్ 25 వ చిత్రానికి త్రివిక్రమ్ ప్రొడ్యూసర్ ?
- April 7, 2017 / 09:27 AM ISTByFilmy Focus
జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్ , కీర్తి సురేష్ లపై కొన్ని సరదా సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. పవన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా నటిస్తున్న ఈ మూవీ హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాధాకృష్ణ పేరుకు మాత్రమే నిర్మాత.. ఖర్చు పెట్టేది అంతా త్రివిక్రమ్ శ్రీనివాసేనని తాజాగా తెలిసింది.
స్టార్ హీరోతో సినిమా కావడంతో బడ్జెట్ వందకోట్లు ఫిక్స్ చేశారు. ప్రొడక్షన్ లోకి వచ్చిన తర్వాత బడ్జెట్ పెరుగుతుందని భయం లేకుండా ఉండేందుకు నిర్మాణ బాధ్యతలు కూడా త్రివిక్రమ్ తీసుకున్నట్లు సమాచారం. పైగా ఈ వందకోట్లలో పదికోట్లు మిగిలించాలని ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఆ విధంగా పవన్ 25 వ చిత్రానికి డైరక్టర్ గానే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రంలో ఖుష్బూ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















