SSMB28: మహేష్‌ సినిమా విషయంలో త్రివిక్రమ్‌ ఏం చేస్తారో?

#SSMB28.. ఈ సినిమా గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని కొన్ని రోజులు, అంతా ఓకే అయ్యింది కానీ కథ ఓకే కాలేదని ఇంకొన్నాళ్లు, మొదలయ్యాక సినిమా కథ విషయంలో మళ్లీ చిన్న చిక్కు వచ్చి పడింది అని ఇంకొన్నాళ్లు చర్చ నడిచింది. ఇప్పుడు ఆఖరి చర్చకు కొనసాగింపు నడుస్తోంది. దానికి కారణం సినిమా షూటింగ్‌లు ఆపేసి మరీ మహేష్‌ విదేశీ పర్యటనలకు వెళ్లడమే. దీంతో సినిమా విషయంలో ఏం జరుగతోంది అనే చర్చ సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది.

‘సర్కారు వారి పాట’ రిలీజ్‌ అవ్వగానే త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుందని మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ధీమాగా చెప్పుకున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్‌ – మహేష్‌ కాంబో ఈ సారి వస్తే రచ్చ రంబోలానే అని వాళ్లు నమ్మడమే. అందులోనూ త్రివిక్రమ్‌ సొంత నిర్మాణ సంస్థ లాంటి హారిక హాసిని క్రియేషన్స్‌లో ఆ సినిమా రూపొందుతుండటమే. త్రివిక్రమ్‌ – హారిక హాసిని కాంబోకి ఇప్పటివరకు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. దీంతో మహేష్‌ – త్రివిక్రమ్‌లో గతంలో చేసిన సినిమాల కంటే మంచి ప్రోడెక్ట్‌ వస్తుందని ఎక్స్పెక్ట్‌ చేశారు ఫ్యాన్స్‌.

కానీ ఇప్పుడు సినిమా షూటింగ్‌ జరుగుతున్న విధానం చూసి ఇబ్బంది పడుతున్నారు. సినిమా షూటింగ్‌ను తొలుత ఓ యాక్షన్‌ సీన్‌తో స్టార్‌ చేశారు. అయితే ఆ యాక్షన్‌ సీన్స్‌ విషయంలో మహేష్‌ అంత సంతృప్తిగా లేరట. ఫైట్‌ మాస్టర్స్‌ను మార్చమని కోరారని అప్పట్లో వార్తలొచ్చాయి. కాదు, కాదు అంతా బాగానే అయ్యింది, త్వరలోనే కొత్త షెడ్యూల్‌ అని నిర్మాతల తరఫున నాగవంశీ ట్వీట్‌ చేశారు. మళ్లీ సినిమా డోలాయమానంలో ఉందా? ఎప్పుడు కొత్త షెడ్యూల్‌ అంటూ మళ్లీ ప్రశ్నలొచ్చాయి. అప్పుడు కూడా నాగవంశీ ట్వీట్‌ చేశారు. త్వరలో ప్రారంభం అనేలా చెప్పారు.

దీంతో మహేష్‌ ఫ్యాన్స్‌ ఈ విషయంలో అంత సంతృప్తిగా లేరని తెలుస్తోంది. కారణం ఇలాంటి ట్వీట్లు లేకుండా నేరుగా కొత్త షెడ్యూల్‌ ఎప్పుడో చెప్పేస్తే సరిపోతుంది కదా. ఈ అరకొర సమాచారంతో ట్వీట్లు ఎందుకు గురూజీ అని అంటున్నారు. ఈ లెక్కన త్రివిక్రమ్‌ పుట్టిన రోజు అయిన నవంబరు 7న అయినా ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus