#SSMB28లో త్రివిక్రమ్‌ స్టైల్‌ సెలక్షన్‌ జరుగుతోందట

త్రివిక్రమ్‌ సినిమాల్లో ఒక థీమ్‌ కచ్చితంగా ఉంటుంది. హీరో మారినా, ప్రొడ్యూసర్‌ మారినా, కథా నేపథ్యం మారినా ఆ యన థీమ్‌ మాత్రం మారదు. అందుకు తగ్గట్టుగానే ఆయన సినిమాల్లో నటీనటుల ఎంపిక జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది తల్లి /అత్త పాత్ర గురించి. త్రివిక్రమ్‌ గత చిత్రాలను గమనిస్తే… అందులో ఇటీవల చిత్రాలు చూస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఒక మాజీ/సీనియర్‌ హీరోయిన్‌ను అత్త/తల్లి పాత్ర కోసం ఎంపిక చేస్తుంటారు.

‘అత్తారింటికి దారేది’లో నదియ, ‘అజ్ఞాతవాసి’లో ఖుష్బూ, ‘అల వైకుంఠపురములో’లో టబు ఇలా సీనియర్‌ హీరోయిన్లు ఉంటూ ఉంటారు. ఇప్పుడు మహేష్‌బాబు 28వ సినిమాగా త్రివిక్రమ్‌ సినిమా రూపొందబోతోంది. ఇందులో మరి ఆ సీనియర్‌ హీరోయిన్‌ ఎవరు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌ ఇప్పటికే సీనియర్‌/మాజీ హీరోయిన్ల జాబితాను సిద్ధం చేసుకున్నారట. అందులో తొలుతగా సిమ్రన్‌ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. ఆమె కాదంటే మిగిలిన పేర్లు చూస్తారట.

ఇక త్రివిక్రమ్‌ సినిమాలో ఉండే రెండో పాయింట్‌ సెకండ్‌ హీరో. హీరో పక్కనే ఉంటాడు కానీ.. హీరో కాని ఓ పాత్ర ఉంటుంది. అలా అని తీసిపారేసే పాత్ర కూడా కాదు. ఇటీవల వచ్చిన ‘అల వైకుంఠపురములో’లో సుశాంత్‌లా అన్నమాట. మహేష్‌ సినిమాలో కూడా అలాంటి పాత్ర ఒకటి ఉందట. ఆ క్యారెక్టర్‌ను ఈ సారి సుమంత్‌ చేస్తాడట. మరి ఆ పాత్ర సంగతేంటి అనేది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ నెలాఖరున మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus