Trivikram, Allu Arjun: అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్.. సినిమా కోసం మాత్రం కాదు?

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇలా త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా శర గంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో ఈయన కొన్ని రోజులు పాటు సినిమాకి విరామం ప్రకటించారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప 2సినిమా షూటింగ్లో త్వరలోనే పాల్గొనబోతున్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఖాళీగా ఉండడంతో వీరిద్దరూ కలిసి ఒక యాడ్ షూట్ నిర్వహించినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో వరుస యాడ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ప్రముఖ ఫుడ్ యాప్ సమస్త జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక తమ యాప్ ను ప్రమోట్ చేయడం కోసం జొమాటో అల్లు అర్జున్ కు భారీ రెమ్యూనరేషన్ చెల్లించారు.

ఈ క్రమంలోనే జొమాటోకు సంబంధించి తాజాగా ఒక యాడ్ నిర్వహించాల్సి ఉండగా అల్లు అర్జున్ ఈ యాడ్ షూట్ చేసే అవకాశం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే హైదరాబాదులో ఒక ప్రైవేట్ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేసి మరి ఈ యాడ్ షోట్ చేసినట్టు సమాచారం. ఈ విధంగా ఒక రోజులోనే యాడ్ షూట్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా యాడ్ షూట్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది.

Ala Vaaikunthapurramuloo Allu Arjun Trivikram

ఒక్క యాడ్ షూట్ చేసినందుకు త్రివిక్రమ్ సుమారు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.అలాగే అల్లు అర్జున్ సైతం ఒక్కో యాడ్ కు తొమ్మిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని. ఇలా వీరిద్దరూ ఖాళీగా ఉండడంతో యాడ్స్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారని ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు వీరిపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus