AA22: త్రివిక్రమ్ అసలు సర్ ప్రైజ్ రెడీ చేశారా..?

‘పుష్ప 2’తో (Pushpa 2: The Rule)  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun), ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్‌పై (AA22) ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో బన్నీ ఓ భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఇప్పటివరకు అధికారిక సమాచారం రాకపోయినా, నెక్స్ట్ లెవెల్ హైప్ ఇప్పటికే క్రియేట్ అయింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను ఉగాది స్పెషల్‌గా అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

AA22

అంతేకాదు, ఈ మూవీ కోసం త్రివిక్రమ్ మరోసారి అనిరుధ్ రవిచందర్‌ను (Anirudh Ravichander) సంగీత దర్శకుడిగా తీసుకున్నట్లు సమాచారం. గతంలో ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) సినిమాతో అనిరుధ్‌ను టాలీవుడ్‌కు తీసుకురావడం త్రివిక్రమ్ చేసినప్పటికీ, ఆ సినిమా ఫలితం సంతృప్తిగా లేకపోవడంతో, ‘అరవింద సమేత’ (Aravinda Sametha Veera Raghava) కు మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఎండికో అనిరుధ్‌ సెట్టవ్వలేదు. దీంతో థమన్‌ను (S.S.Thaman) తీసుకున్నారు. కానీ ఇప్పుడు అనిరుధ్ పాన్ ఇండియా స్థాయిలో తన మార్క్ మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో, మళ్లీ ఆయనను తీసుకోవాలని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారట.

ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుందని, దానికి తగ్గట్టుగా భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందనే టాక్ ఉంది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీకి విపరీతమైన క్రేజ్ పెరిగిన నేపథ్యంలో, అతని మార్కెట్‌ను మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. త్రివిక్రమ్ ఇప్పటి వరకూ మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ డైరెక్ట్ చేసినప్పటికీ, ఈసారి పాన్ ఇండియా స్కేల్‌లో తీసుకెళ్లే ప్రాజెక్ట్ కావడంతో భారీ కసరత్తు చేస్తున్నారని టాక్.

AA22 స్టోరీ లైన్ ఇప్పటికే ఫిక్స్ అయిందని, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది ఇంకా కన్‌ఫర్మ్ కావాల్సి ఉంది. మరి త్రివిక్రమ్ – బన్నీ మూడో కాంబో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus