లాక్ డౌన్ లో టాలీవుడ్ కి సంబంధించిన ఓ వివాదం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్లు చర్చలు మొదలుపెడితే.. భూములు పంచుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్లంతా ప్రభుత్వ అధికారులను కలిశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలయ్య. పబ్లిక్ గా బాలయ్య ఇలా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఆ తరువాత బాలయ్య ఎప్పుడు కూడా ఆ ఇష్యూపై స్పందించడానికి ఇష్టపడలేదు. పలు ఇంటర్వ్యూలలో ఆయనకి ప్రశ్నలు ఎదురైనా.. స్కిప్ చేసేశారు. తాజాగా మరోసారి బాలయ్యపై అందరి దృష్టి పడింది.
దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి రాయితీలు ఇవ్వడంతో పాటు.. థియేటర్లు తెరుచుకునేందుకు, టికెట్ ధరలు సవరించుకునేందుకు అనుమతులు ఇవ్వడమే. ఈసారి కూడా చిరంజీవి, నాగార్జున లాంటి సినీ పెద్ద సహకారం కారణంగానే ఇది సాధ్యమైందని తెలుస్తోంది. గతంలో చిరు, నాగార్జున ఇండస్ట్రీ తరఫున ముందుకొచ్చి చర్చలు చేస్తే తమ సొంత లాభం కోసం మాట్లాడుతున్నారని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిన బాలయ్య.. ఇప్పుడు ఏమంటారంటూ ఇండస్ట్రీలో ఓ వర్గం ప్రశ్నిస్తోంది.
ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అందరినీ సంతృప్తి పరచడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. టీఆర్ఎస్ కి టీడీపీ కి పడదు కాబట్టి బాలయ్య సైలెంట్ గా ఉన్నా.. కనీసం సినిమా ఇండస్ట్రీ కోణంలోనైనా స్పందిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా బాలయ్యపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. కానీ బాలయ్య మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?