సినిమా వాళ్లు మాట మీద నిలబడరు అంటుంటారు.. ఈ మాటలో ఎంత నిజముందో తెలియదు కానీ.. కొన్ని సినిమాలకు సంబంధించి సీన్లు, అలాంటి సీన్ల గురించి గతంలో ఆ నటుడు/ నటి గతంలో చెప్పిన మాటలు వైరల్ అవ్వడంతో ఈ మాట అనాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ మాటను ఫేస్ చేస్తున్న నటుడు రాకింగ్ స్టార్ యష్. ఆయన ప్రధాన పాత్రలో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా గ్లింప్స్ టీజర్ ఇటీవల విడుదలైంది. అందులో ఓ సీన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఒక మహిళా డైరక్టర్ ఇలాంటి సీన్ పెట్టడమా అంటూ కొంతమంది దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి మాట్లాడుతుంటే.. మరికొందరేమో యశ్ ఇలాంటి సీన్ చేయడమేంటి అని కామెంట్ చేస్తున్నారు. యశ్ చేస్తే ఏమైంది అని అనుకంటున్నారా? ఈ విషయం తేలాలి అంటే.. కొన్ని నెలల క్రితం యశ్ చేసిన కొన్ని కామెంట్ల గురించి తెలియాలి. ఓ టీవీ ప్రోగ్రామ్‌కి వచ్చిన యశ్ ‘తన తల్లిదండ్రులతో కలసి చూడలేని సన్నివేశాలు ఉన్న సినిమాలు చేయను’ అని చెప్పాడు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో అలాంటి కామెంట్లు చేసిన యశ్.. వన్స్ స్టార్ స్టేటస్ వచ్చాక ఆ మాటలు మరచిపోయినట్లున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా వాళ్లు మాట మీద నిలబడరు అని అనేది ఇందుకే. గ్లామర్ షోకి ఆమడ దూరం అని చెప్పే హీరోయిన్లు కాస్త ఫేమ్ తగ్గాక, అవకాశాలు తగ్గా ఎలా అయితే గ్లామర్ షో చేస్తారో.. హీరోలు స్టార్‌లు అయ్యాక ఇలాంటి సీన్స్ చేస్తారా అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. యశ్‌తో పాటు కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేస్తామని చెబుతున్నారు. అలాగే ఇది పాన్ వరల్డ్ సినిమా కూడా చెబుతున్నారు.
