Chiranjeevi: ఆ విషయంలో చిరంజీవికి ఎవరూ సాటిరారుగా.. ఎందుకు నిందిస్తారంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి అభిమానులను ఎంత ప్రేమగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులకు ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో చిరంజీవి ముందువరసలో ఉంటారు. అయితే చిరంజీవి ఏ తప్పు చేయకపోయినా కొంతమంది సోషల్ మీడియా వేదికగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే చిరంజీవి ఒక పెద్దావిడపై చిరాకు పడ్డారని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. చిరంజీవి ఏ తప్పు చేయకపోయినా ఆయన పేరును చెడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు.

వాస్తవం ఏంటంటే ఒక అభిమాని చిరంజీవితో ఫోటో దిగాలని భావించగా అప్పటికే చిరంజీవి కారు ఎక్కినా ఆ అభిమానిని ఇబ్బంది పెట్టకూడదని భావించి కారు దిగి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే వీడియో మొత్తంలో ఒక రెండు సెకన్ల పాటు చిరంజీవి సరదాగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లను కట్ చేసి కొంతమంది కావాలని వైరల్ చేస్తున్నారు. అభిమానులకు విలువ ఇచ్చే విషయంలో చిరంజీవికి ఎవరూ సాటిరారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి (Chiranjeevi) ఎంత మంచి చేసినా కొంతమందికి అర్థం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా భోళా శంకర్ మెగాస్టార్ కు మరో హిట్ అందిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కొత్త సినిమాలకు సంబంధించి స్పష్టత రానుంది. చిరంజీవి మల్టీస్టారర్ లలో ఎక్కువగా నటిస్తున్నారు. రీమేక్ సినిమాలకు మాత్రం చిరంజీవి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆయన మనస్సులో ఏముందో తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో చిరంజీవి రీమేక్ లలో నటిస్తే కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. చిరంజీవి మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవితో కలిసి నటించడానికి ఇతర భాషల హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus