దర్శనం మొగిలయ్య గత కొన్ని రోజుల వరకు ఈయన పేరు ఎవరికీ తెలియకపోయినా భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగిలయ్య తన 12మెట్ల కిన్నెర వాయిద్యంతో నగర వీధులలో తిరుగుతూ పొట్ట పోసుకునే వారు.ఈ విధంగా కిన్నెర మెట్ల వాయిద్యం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పాటపాడే అవకాశం అందుకున్నారు.
పూరి గుడిసెలో నివసిస్తూ పొట్ట పోసుకోవడానికి కూడా ఎంతో కష్టతరంగా ఉన్నటువంటి మొగిలయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం చేయడంతో ఎంతో మంది ముందుకు వచ్చి ఆయనకు ఆర్థికంగా సహాయం చేశారు. ఇకపోతే ఈయన వాయిద్యంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఏకంగా ఈయనకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ప్రకటించింది.
ఇక ఈయన ఎంతో గౌరవప్రదమైన పద్మశ్రీ పురస్కారం అందుకోవడమే కాకుండా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కిన్నెర మొగిలయ్యకు హైదరాబాదులో ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయలు నగదు ప్రకటించారు. ఈక్రమంలోనే ఈయనకు బీఎన్ రెడ్డి నగర్‌లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కిన్నెర మొగులయ్యకు 300 గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయించే ఒకే ఒక కళాకారుడిగా మొగిలయ్య ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయనకు పద్మశ్రీ ప్రకటించడంతో పలు కారణాల వల్ల ఆయన తనకు ఇచ్చిన పద్మశ్రీ వెనక్కి తిరిగి ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.