Tuck Jagadish: టీవీల్లో సక్సెస్ అయిన నాని ‘టక్ జగదీష్’..!

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ చిత్రం డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కూడా కీలక పాత్ర పోషించింది. సాధారణంగా డైరెక్ట్ గా ఓటిటిల్లో రిలీజ్ అయిన సినిమాలను చాలా వరకు జనాలు చూసేస్తారు.కాబట్టి టీవీల్లో టెలికాస్ట్ అయ్యేటప్పుడు జనాలు చూస్తారు అన్న గ్యారెంటీ ఉండదు.

అందుకే డైరెక్ట్ గా ఓటిటిల్లో రిలీజ్ అయ్యే సినిమాలకి శాటిలైట్ రైట్స్ రేట్లు ఎక్కువ పలకవు.ఇక ‘టక్ జగదీష్’ విషయానికి వస్తే వినాయక్ చవితి రోజునాడు అంటే సెప్టెంబర్ 10న ఓటిటిలో రిలీజ్ అయ్యింది. అమెజాన్ వారికి ఈ చిత్రం వల్ల లాభాలే దక్కినట్టు అధికారికంగా ప్రకటించారు. ‘వి’ ‘టక్ జగదీష్’ సినిమాలతో నాని ఓటిటిల్లో మంచి ఫలితాల్నే అందుకున్నాడు. ఇక ‘టక్ జగదీష్’ ను ఇటీవల స్టార్ మా వారు ప్రసారం చేయగా… మంచి టి.ఆర్.పి రేటింగ్ నే సాధించింది.

ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ.8 కోట్ల కు అమ్ముడైనట్టు సమాచారం. ఇక మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ‘టక్ జగదీష్’ 10.9 రేటింగ్ ను నమోదు చేసింది. దీంతో స్టార్ మా వారికి లాభాలు దక్కినట్టు తెలుస్తుంది. ఇంకో రెండు సార్లు టెలికాస్ట్ అయితే ‘టక్ జగదీష్’ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus