నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు సడెన్ గా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ఛానెల్ తో డీల్ కుదుర్చుకుంటున్నట్లు.. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం నిర్మాతల వరకు వెళ్లడంతో వారు క్లారిటీ ఇచ్చేశారు.
‘టక్ జగదీష్’ సినిమా థియేటర్లోనే రిలీజ్ అవుతుందని.. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే ఈ సినిమాను తెరకెక్కించామని.. కాబట్టి డిజిటల్ రిలీజ్ ఉండదని స్పష్టం చేశారు. ఓటీటీలో సినిమా రిలీజ్ అవుతుందనే వార్తలను నమ్మొద్దని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన తరువాత ‘టక్ జగదీష్’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను థియేటర్లలోనే ఎంజాయ్ చేద్దామంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ జరిగిపోయింది.
లక్ష్మణ్ అనే వ్యక్తికి మొత్తం థియేట్రికల్ రైట్స్ ను అమ్మేశారు. అతడు ఏపీ, తెలంగాణాలలో సెపరేట్ గా రైట్స్ ను అమ్ముకున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!