అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం
- June 2, 2016 / 02:08 PM ISTByFilmy Focus
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో సారి వార్తల్లో నిలిచాడు. “చెప్పను బ్రదర్” అంటూ ఒక్క మాటతో సోషల్ మీడియా లో ట్రెండ్ గా మారిన బన్నీ ఇప్పుడు అభిమానులు ఆనందించే విషయంతో ముందుకు వచ్చాడు. ఇది వరకు తెలుగు నటులే కాదు, సౌత్ ఇండియా యాక్టర్లు ఎవరూ అందుకోని అరుదైన గౌరవం పొందాడు. టర్కిష్ కాన్సులేట్ స్వయంగా హైదరాబాద్ కి వచ్చి స్టైలిష్ స్టార్ కి టర్కిష్ వీసాని అందించారు.
మరిన్ని విజయాలను అల్లు అర్జున్ అందుకోవాలని విష్ చేసారు. ఈ గౌరవాన్ని సంతోషంగా స్వీకరించిన బన్నీ.. వీసా అందుకుంటున్న ఫోటోను ట్విట్టర్లో పెట్టి టర్కిష్ ప్రభుత్వానికి, టర్కిష్ వాసులకు కృతజ్ఞతలు తెలిపాడు. టర్కీలో స్టైలిష్ స్టార్ కి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు.
అల్లు అర్జున్ తాజా సినిమా సరైనోడు ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లు వసూలు చేసింది. మలయాళం లో “యోదవు”గా రిలీజ్ అయి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ ఆనందంలో ఉన్న బన్నీకి ఈ గౌరవం మరింత సంతోషాన్నికలిగించింది.
I would like Thank the Turkish Consulate for the Personal Honours. pic.twitter.com/OfW47MUKLP
— Allu Arjun (@alluarjun) June 2, 2016
















