హ్యాంగోవర్ పోవడం లేదంటున్న నటి… లిమిట్ ఉండాలంటున్న నెటిజన్స్!

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మే 25వ తేదీ తన 50వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో పలు సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ నటీనటులందరూ కూడా ఈ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని పెద్ద ఎత్తున సందడి చేశారు. కరణ్ పార్టీ అంటేనే బాలీవుడ్ తారలు అందరూ ఎక్కడున్నా వారి పనులను పక్కన పెట్టి ఇక్కడ వాలిపోతారు. అంత గ్రాండ్ గా ఈయన పార్టీలు ఉంటాయి.

ఇలా తన 50వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకోవడంతో తాజాగా బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఈ పార్టీ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. కరణ్ జోహార్ ఇలాంటి పార్టీలు ఇవ్వకుండా తనని బ్యాన్ చేయాలంటూ ఈమె డిమాండ్ చేశారు. ఇలా ఈమె షాకింగ్ కామెంట్ చేయడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే. పుట్టినరోజు వేడుకలలో భాగంగా బాలీవుడ్ నటీ నటులతో పాటు అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో హాజరయ్యాడు.

ఈ పార్టీలో భాగంగా ట్వింకిల్ ఖన్నా ఫుల్లుగా డ్రింక్ చేస్తూ భారీగా ఎంజాయ్ చేశారు. ఇలా అర్ధ రాత్రి వరకు బర్తడే పార్టీలో పెద్ద ఎత్తున రచ్చ చేసిన ఈమెకు మరుసటి రోజు ఉదయం అయినా కూడా హ్యాంగోవర్ పోవడం లేదని ఇలాంటి పార్టీలు ఇచ్చినందుకు తనని బ్యాన్ చేయాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆయన పార్టీకి పిలిస్తే వెళ్లిపోవడమేనా.. నీకు లిమిట్ ఉండాలి కదా అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు తన పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ట్వింకిల్ ఖన్నా చేసిన ఈ పోస్టు చూస్తుంటే కరణ్ జోహార్ ఏ రేంజ్ లో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారో అర్థమవుతుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus