పూరి జగన్నాథ్… ‘టెంపర్’ వంటి హిట్ తర్వాత అరడజను ప్లాపులు ఫేస్ చేసి ‘ఇస్మార్ట్ శంకర్’ తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ మూవీతో పూరికి ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి. అప్పటివరకు పూరి ‘కథ చెబుతాను’ అంటే మొహం చాటేసిన హీరోలు ‘పూరి మా దగ్గరికి ఎప్పుడు కథ తెస్తాడు’ అంటూ ఎదురుచూసేలా చేసింది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం. అప్పటివరకు ఫుల్ ఫామ్లో ఉన్న విజయ్ దేవరకొండ పూరితో సినిమా చేయడానికి ఒప్పుకుంది కూడా ఈ రీజన్ తోనే అన్నది అందరూ ఒప్పుకుంటారు.
దీంతో ‘లైగర్’ అనేది బిగ్ ప్రాజెక్ట్ అయిపోయింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవ్వడంతో.. దీనినొక ‘బాహుబలి’ ప్రాజెక్టులా భావించి భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు బయ్యర్స్. తీరా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ టాక్ వచ్చింది. సాయంత్రం షోలకే జనాలు లేరు. రెండో రోజుకే చాలా వరకు స్క్రీన్లు తగ్గిపోయాయి. ఇక బయ్యర్స్ భారీగా నష్టపోవడంతో ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నట్టు కొంత అమౌంట్ తిరిగిస్తాము అని పూరి బయ్యర్స్ తో చెప్పిన సంగతి తెలిసిందే.
పూరి చెప్పిన టైం దాటిపోవడంతో బయ్యర్స్ పూరి ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ బెదిరిస్తున్నారు.. అలా చేస్తే ఒక్క రూపాయి కూడా తిరిగివ్వను అంటూ పూరి వారికి కౌంటర్ ఇవ్వడం మనం చూశాం. మొన్నటి వరకు ఇలాంటి వ్యవహారాలు కొరటాల ఫేస్ చేశాడు. అలా అని పూరికి ఇలాంటి వ్యవహారాలు కొత్తేమి కాదు. ‘ఆంధ్రావాలా’ సినిమా టైం నుండి ఇలాంటివి పూరి ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ‘సింహాద్రి’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ‘ఆంధ్రావాలా’ కి భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
కానీ 4 రోజులకే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఆ టైంలో బయ్యర్స్ కు పూరి కొంత అమౌంట్ వెనక్కి ఇప్పించారు. ‘నేనింతే’ టైం లో కూడా అంతే..! అలాగే ‘లోఫర్’ సినిమా కూడా భారీ నష్టాలను తెస్తే.. బయ్యర్స్ పూరికి ఫోన్ చేసి విసిగించడంతో బయ్యర్స్ అసోసియేషన్ కు పూరి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ‘లైగర్’ మాత్రమే కాదు ‘నేనింతే’ ‘లోఫర్’ వంటి చిత్రాల టైంలో కూడా బయ్యర్స్ తో చాలా ఇబ్బంది పట్టాడు పూరి.