సినిమా కథలు బాగా రాసేవారు.. దర్శకత్వంలోకి వచ్చి హిట్లు కొట్టారు, కొడుతున్నారు, కొడతారు కూడా. ఎందుకంటే వారికి పట్టు అలా ఉంటుంది మరి. అయితే బాగా దర్శకత్వం వచ్చినవాళ్లు కథ రాయడం అనేది మనం పెద్దగా చూసి ఉండం. ఏంటీ.. దర్శకుడు, రచయిత గురించి ఇంతగా చెబుతున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు టాపిక్ రాత – తీత మధ్యనే కాబట్టి. ఓ మంచి కథ రాసుకొని డైరక్ట్ చేస్తే మంచి విజయాలు అందుతున్నాయి. అదే వేరే వారికి ఇస్తే కష్టమేనా? ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ చర్చ మళ్లీ వచ్చింది.
బాగా సినిమా తీసేవాళ్లు కథ రాసి వేరొకరికి ఇస్తే సరైన విజయాలు దక్కవు అని గతంలో కొన్ని సార్లు నిరూపితైమంది. తాజాగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ తేడా కొట్టేసరికి ఈ మాట మరోసారి డిస్కషన్‌కి వచ్చింది. ‘జాతిరత్నాలు’తో సెకండ్ అటెంప్ట్‌లో మంచి విజయం అందుకున్నారు కేవీ అనుదీప్. ఆ సినిమాలో ఆయన రాసిన టైమింగ్, కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. కానీ నెక్స్ట్ ప్రయత్నం ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ కథ రాసుకొని వేరేవాళ్లకు ఇచ్చారాయన. దీంతో సినిమా దెబ్బకొట్టింది అని చెప్పాలి.
ఆ సినిమాకు దర్శకత్వం వహించిన వంశీధర్, లక్ష్మీనారాయణ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఈ సినిమా పక్కనపెట్టి కొంచెం వెనక్కి వెళ్తే మరో సినిమా ఇలాంటిదే కనిపిస్తుంది. ‘గాలి సంపత్’ అంటూ అనిల్ రావిపూడి ఓ కథకు స్క్రీన్‌ప్లే రాసిచ్చారు. అనీశ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అన్నట్లు ఈ సినిమాకు అనిల్ సమర్పకులు కూడా. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర చేదునే మిగిల్చింది. దీంతో అప్పుడు కూడా ఇలానే మాట్లాడుకున్నారు. రాసి తీస్తే ఓకే కానీ, రాసి ఇచ్చేస్తే కష్టమే అని అన్నారు. ఇప్పుడూ అదే అంటున్నారు.
టాలీవుడ్‌లో ఇలా దర్శకులు కథలు వేరొకరికి ఇచ్చే సందర్భాలు తక్కువ. కానీ ఇచ్చిన వాటిలో విజయాల శాతం చాలా తక్కువే అని చెప్పాలి. పూరి జగన్నాథ్ కూడా ఇలా కథలు ఇచ్చి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. దీంతో దర్శకులు కమ్ రచయితలు ఈ విషయం గమనించాలి అని అభిమానులు అనుకుంటున్నారు.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!