పాపులర్ యాంకర్ మళ్ళీ వస్తోంది..!
- September 12, 2017 / 11:15 AM ISTByFilmy Focus
ప్రెజంట్ జనరేషన్ లో అనసూయ, రేష్మి, సుమ లాంటి యాంకర్స్ అందరు ఎంజాయ్ చేస్తున్న క్రేజ్ ను 90వ దశకంలో ఉదయభాను ఒక్కర్తే ఎంజాయ్ చేసేది. రియాలిటీ షోలు మొదలుకొని, రోడ్ షోస్, యాంకరింగ్, ఈవెంట్ ఆర్గనైజింగ్ వరకూ అన్నిట్లోనూ వెళ్ళు-కాళ్ళు పెట్టేసి తన స్థాయికి చేరుకొనే ఆలోచన సైతం ఎవరూ చేయని స్థాయికి చేరుకొన్న ఉదయభాను తర్వాత పెళ్లి, పిల్లల కారణంగా బుల్లితెరకు దూరమైన ఉదయభాను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనుంది.
ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా ఉదయభాను స్వయంగా తెలపడం విశేషం. మా టీవి నిర్వహించనున్న ఓ డ్యాన్స్ షో హోస్ట్ గా ఉదయభాను మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనుంది. పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణుదేశాయ్ ఈ షోకు జడ్జ్ గా వ్యవహరించనుండగా.. ఉదయభాను ఇదే షో ద్వారా రీఎంట్రీ ఇవ్వనుండడం మాటీవీ రియాలిటీ షోకు టీయార్పీ పరంగా ప్రకంపనలు సృష్టించడం ఖాయం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











