అల్లు అర్జున్ (Allu Arjun) , అను మెహతా (Anuradha mehta) హీరో,హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్య’ (Aarya) సినిమాని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. శివ బాలాజీ (Siva Balaji) కీలక పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై ‘దిల్’ రాజు (Dil Raju) నిర్మించారు. 2004 మే 7న ‘ఆర్య’ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు దశాబ్దాలు అదే 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్య’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :
1) ‘దిల్’ సినిమాకి దర్శకుడు సుకుమార్ (Sukumar) అసిస్టెంట్ గా పనిచేశాడు. అదే టైంలో ‘ఆర్య’ కథ గురించి దిల్ రాజుకి చెప్పారు. ‘దిల్’ సెట్స్ లోనే నితిన్ (Nithin) కి కూడా చెప్పమన్నారట. నితిన్ అండ్ టీం ఫస్ట్ హాఫ్ విన్నారు కానీ సెకండ్ హాఫ్ వినలేదట. ఆ తర్వాత దిల్ రాజు పూర్తిగా ‘ఆర్య’ కథ విన్నారట. కానీ ఆయనకు సెకండ్ హాఫ్ ఎందుకో ఎక్కలేదు. కానీ ఐడియా నచ్చి ‘దిల్’ కనుక హిట్ అయితే సెకండ్ మూవీ నీతోనే చేస్తాను. ‘ఎందుకంటే ఫస్ట్ సినిమా ఆడకపోతే సెకండ్ సినిమా కొత్త వాళ్ళతో చేసే రిస్క్ చేయలేను… కాబట్టి నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు’ అని సుకుమార్ తో చెప్పారట దిల్ రాజు.
2) ‘దిల్’ సినిమా రిలీజ్ రోజున సుకుమార్ తన సొంత ఊర్లో ఉన్నాడట. సూపర్ హిట్ టాక్ రావడంతో ‘నువ్వు.. బస్సు ఎక్కి వచ్చెయ్’ అని సుకుమార్ తో దిల్ రాజు చెప్పారట. అయితే ‘ఆర్య’ కథకి ఎందుకో హీరోలు ఓకే చెప్పడం లేదట. రవితేజకి (Ravi Teja) చెబితే ‘కొత్త హీరోకి అయితే బాగుంటుంది’ అని సైడ్ అయ్యాడట. ప్రభాస్ కి (Prabhas) చెబితే ‘ ‘వర్షం’ (Varsham) షూటింగ్లో బిజీగా ఉండటం.. వేరే ప్రాజెక్టుకి కమిట్ అవ్వడంతో’ నో చెప్పాడట. ఓ దశలో అల్లరి నరేష్ కి (Allari Naresh) కూడా ‘ఆర్య’ కథ చెప్పారట.
3) అయితే ”దిల్’ సినిమా చూస్తాము’ అంటూ తరుణ్ (Tarun) వంటి యంగ్ హీరోలు దిల్ రాజుని అడగడంతో ప్రసాద్ ల్యాబ్స్ లో వారికి స్పెషల్ షో వేయించారట దిల్ రాజు. దానికి అల్లు అర్జున్ వచ్చాడట. అతన్ని చూడగానే తమ కథకి ఇతను సరిపోతాడేమో అని దిల్ రాజు, సుకుమార్ భావించారట. ఆ మరుసటి రోజు ఫోన్ చేసి వెళ్లి కథ చెప్పారట. అల్లు అర్జున్ కి కథ నచ్చింది. కానీ అల్లు అరవింద్ కి (Allu Aravind) సెకండ్ హాఫ్ నచ్చలేదట. దీంతో మళ్ళీ దాని పై వర్క్ చేసి.. ముందుగా అల్లు అర్జున్ కి వినిపించి.. ఆ తర్వాత అల్లు అరవింద్ కి వినిపించారట. ఆ తర్వాత చిరంజీవికి (Chiranjeevi) కూడా వినిపించగా ఆయన కూడా బాగుంది అని చెప్పారట.
4) మొత్తానికి ‘ఆర్య’ ప్రాజెక్టుకి ముహూర్తం ఫిక్స్ చేశారు. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు (R. Rathnavelu) ని తీసుకున్నారు. ‘వర్షం’ కి మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు అని దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ద్వారా దిల్ రాజు తెలుసుకుని దేవి శ్రీ ప్రసాద్ ని (Devi Sri Prasad) ఫైనల్ చేశారట.
5) 117 రోజులు ‘ఆర్య’ చిత్రీకరణ జరిగింది అని దిల్ రాజు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
6) ఆడియో లాంచ్ వేడుకకి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , ప్రభాస్..లు ముఖ్య అతిథులుగా హాజరయ్యి .. ‘ఆర్య’ టీంకి బెస్ట్ విషెస్ చెప్పారు.
7) 2004 మే 7న పెద్దగా అంచనాలు లేకుండానే ‘ఆర్య’ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. యూత్ కి ఈ సినిమా అమితంగా నచ్చేసింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు. రోజు రోజుకీ థియేటర్లు పెరిగాయి.
8) ‘ఆర్య’ ఓ పాత్ బ్రేకింగ్ మూవీ అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకు ముందు ఏ సినిమాల్లోనూ లేని విధంగా సన్నివేశాలు, హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అందుకే ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టార్ హీరో అయిపోయాడు.
9) దర్శకుడు సుకుమార్ కి కూడా డిమాండ్ బాగా పెరిగింది. చెక్కులతో నిర్మాతలందరూ అతని కోసం క్యూలు కట్టారు.
11) ‘ఆర్య’ సినిమా లేకపోతే నాకు ఈ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేది కాదేమో అని ‘పుష్ప’ (Pushpa) సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
12) మేము ఎన్ని సూపర్ హిట్ సినిమాలు తీసినా.. ‘ఆర్య’ అనే సినిమాతోనే నేను లైమ్ లైట్లోకి వచ్చాను. ‘ఆర్య’ సినిమా నాకు చాలా ప్రత్యేకం అని దిల్ రాజు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
13) ‘ఆ అంటే అమలాపురం’ అనే పాటలో అల్లు అర్జున్ ప్లేస్ లో నేను ఉంటే ఇరగదీసేసే వాడిని అంటూ మెగాస్టార్ చిరంజీవి సైతం ‘ఆర్య’ సినిమా పాటల గురించి, అల్లు అర్జున్ గురించి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి ఓ సందర్భంలో చాలా గొప్పగా చెప్పుకొచ్చారు అంటే ‘ఆర్య’ సినిమా పాటలు ఏ రేంజ్లో చార్ట్ బస్టర్స్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు.
14) అంతేకాదు ‘ఆర్య’ సినిమాతో మలయాళంలో కూడా అల్లు అర్జున్ కి సూపర్ క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుండి అక్కడి ప్రేక్షకులు అల్లు అర్జున్ ని ‘మల్లు అర్జున్’ అంటూ పిలుచుకుంటూ ఓన్ చేసుకున్నారు.
15) బెంగాలీ, తమిళ్, ఒడియా వంటి భాషల్లో కూడా ‘ఆర్య’ సినిమా రీమేక్ అవ్వడం ఇంకో విశేషంగా చెప్పుకోవాలి.
16) ఇక ‘ఆర్య’ చిత్రానికి గాను దర్శకుడు సుకుమార్ కి ఫిలింఫేర్ , నంది అవార్డులు లభించాయి. అల్లు అర్జున్ కి స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నంది అవార్డు లభించింది. మొత్తంగా ‘ఆర్య’ సినిమాకి 4 నంది అవార్డులు లభించాయి.