రాజమౌళితో (S. S. Rajamouli) చేసిన ‘సై’ (Sye) తర్వాత డజను ప్లాపులు ఇచ్చాడు నితిన్ (Nithin Kumar) అని అంతా అంటుంటారు. కానీ వాటిలో ఒకటి, రెండు యావరేజ్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ‘ద్రోణ’ (Drona)సినిమా. 2009వ సంవత్సరం ఫిబ్రవరి 20న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రాజమౌళి శిష్యుడు జె.కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. దీనికి ముందు ‘స్టూడెంట్ నెంబర్ 1’ (Student No: 1) సినిమాకు కూడా అతను ఓ రైటర్ గా పనిచేశాడు.
‘ద్రోణ’ అనే సినిమా వస్తున్నట్టు కూడా మొదట్లో చాలా మందికి తెలీదు. కానీ ఊహించని విధంగా అందులో హీరోయిన్ గా నటించిన ప్రియమణి (Priyamani) బికినీ స్టైల్ ఒకటి వదిలారు.అలాంటి వాటికి ఇప్పట్లో డిమాండ్ లేదు కానీ.. అప్పట్లో వాటికి మంచి డిమాండ్ ఉండేది. చాలా మ్యాగ్జైన్లలో ఆ స్టైల్ ని కవర్ పేజీగా వేసుకున్నారు. దానిపై కొంత కాంట్రోవర్సీ కూడా అయ్యింది. మహిళా సంఘాలు ఆ పోస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీని తర్వాత ఇందులో నితిన్- ప్రియమణి..ల రెయిన్ సాంగ్ కి సంబంధించిన స్టిల్స్ కూడా వదిలారు. వాటితో ఈ సినిమాలో గ్లామర్ ఎక్కువగా ఉంటుంది అని అంతా ఫిక్స్ అయ్యారు. అది ఈ సినిమా పబ్లిసిటీగా బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించి ‘ఏం మాయో చేసావే’ అనే సాంగ్ వదిలారు. అందులో నితిన్ స్టెప్స్ కొత్తగా ఉంటాయి. జానీ మాస్టర్ (Jani Master ) ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
‘ఏం మాయో చేసావే’ (Ye Maaya Chesave) అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. అనూప్ రూబెన్స్ (Anup Rubens) దీనికి సంగీత దర్శకుడు. వీటి వల్ల ‘ద్రోణ’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మొదటి రోజు నెగిటివ్ టాకే వచ్చింది. కానీ బి,సి సెంటర్ ఆడియన్స్ ఈ సినిమాను బాగానే చూశారు. దీంతో టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ‘ద్రోణ’ పర్వాలేదు అనిపించే ఫలితాన్ని అందుకుంది అని అని చెప్పాలి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది.