నటరత్న ఎన్టీఆర్ నట జీవితంలో ఎన్నో అద్భుతమైన, మరపురాని చిత్రాలున్నాయి. పౌరాణిక, జానపద, సాంఘిక, చారిత్రాత్మక సినిమాలతో సత్తా చాటారు. మరీ ముఖ్యంగా రాముడు, కృష్ణుడు వంటి పాత్రలకు ప్రాణం పోసి.. తెలుగు వారి ఆరాధ్యదైవంగా మారిపోయారు. సినిమా పరిశ్రమలో జయాపజయాలనేవి సర్వసాధారణం.. ఆయన చిత్రాలు కొన్ని విజయం సాధించకపోయినా కానీ ఆయన నటనతో ప్రతి పాత్రకు జీవం పోశారు. పౌరాణిక పాత్రలు చేయాలంటే ఒక్క తారక రాముడికి మాత్రమే సాధ్యం.
ఇక కుటుంబ కథా చిత్రాలతోనూ ప్రేక్షకాభిమానులను అలరించారు.. వాటిలో ఎన్టీఆర్ – కృష్ణ కుమారి జంటగా.. ఐ.ఎన్.మూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుగు పొరుగు’ కూడా ఒకటి. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కళాప్రపూర్ణ బ్యానర్ మీద సి.విజయ సారథి నిర్మించారు. కొండేపూడి లక్ష్మీ నారాయణ డైలాగులు రాశారు. 1957లో బెంగాళీలో విజయం సాధించిన అమీ బరో హోబో (Ami Baro Hobo) చిత్రం ఆధారంగా ఈ ‘ఇరుగు పొరుగు’ చిత్రాన్ని తెరకెక్కించారు.
1963 జనవరి 11న విడుదలైంది. 2023 జనవరి 11 నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. రేలంగి, గుమ్మడి, వి.నాగయ్య, గిరిజ, శోభన్ బాబు, ఎల్.విజయలక్ష్మీ, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య, సీఎస్ఆర్, ఎమ్.బాలయ్య తదితరులు కీలకపాత్రల్లో నటించారు. మాస్టర్ వేణు సంగీతమందించారు. అప్పట్లో నిండైన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందీ చిత్రం. కథ, క్యారెక్టర్లను బట్టి రాసుకున్న కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
అలాగే కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, బంధాల యొక్క అనుబంధాలు, ఆప్యాయతలు వంటివి అలరించేలా చూపించారు. ఎన్టీఆర్‌తో సహా ఇతర నటీనటుల సహజమైన నటన సినిమా స్థాయిని పెంచాయి. అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం 50 రోజులు ప్రదర్శింపబడి యావరేజ్‌గా నిలిచింది.
అయితే ఎక్కువ శాతం కామెడీ ఉండడం వల్లనేమో కానీ ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు. కాస్త కామెడీ మోతాదు తగ్గించి, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటివి యాడ్ చేసుంటే బాగుండేది అంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!