నటరత్న ఎన్టీఆర్.. ‘కళ్లు మూసుకుని కనేది కల.. కళ్లతో అభినయించేది కళ.. నిద్రపోతూ కనేది కల.. నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది కళ.. అందుకే కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు.. రాష్ట్రాలను ముఖ్యమంత్రులుగా ఏలగలిగారు’ అంటూ ‘నరసింహ నాయుడు’ లో నటసింహ నందమూరి బాలకృష్ణ చెప్పిన డైలాగ్ నందమూరి తారక రామారావుకి సరిగ్గా సరిపోతుంది.. కథానాయకుడిగా మొదలైన ప్రస్థానం ప్రజానాయకుడిగా మారడం వరకు తారక రాముడి జీవితంలో ఎన్నీ కీలక మలుపులు.. తెలుగు జాతి తెరమీద చూసిన రాముడు, కృష్ణుడు ఆయనే..
తెలుగు వారి మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్ నటుడిగా ప్రయాణం ప్రారంభించి 73 సంవత్సరాలవుతోంది. 1949 లో సరిగ్గా ఈరోజే (నవంబర్ 24) తారక రామారావు తొలి చలన చిత్రం ‘మనదేశం’ విడుదలైంది.. 2022 నవంబర్ 24 నాటికి 73 సంవత్సరాలవుతోంది. అంటే నేటికి వెండితెర మీద హీరోయిజం మొదలై 73 ఏళ్లైంది.. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు.
పాత్రలో లీనమైపోయి లాఠీతో నిజంగానే కొట్టడం.. అప్పుడే నటనపట్ల ఆయనకున్న ఇష్టాన్ని దర్శకులు ప్రసాద్ గుర్తించడం లాంటి సంఘటనలు జరిగాయి. వీటినే బాలయ్య ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ లో ఆసక్తికరంగా చూపించారు. అలా మొదలైన తారక రాముని నట ప్రస్థానం.. తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాట ప్రేక్షకుల హృదయాలను ఏలే చక్రవర్తిగా.. వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడిగా కొనసాగింది..
ఘంటసాల, పి.లీలకు కూడా తొలిచిత్రమే..
నటరత్న ఎన్టీరామరావుతో పాటు లెజెండరీ మ్యుజీషియన్ ఘంటసాల, ప్రముఖ నేపథ్య గాయని పి.లీల కూడా ‘మనదేశం’ తొలి చిత్రమే.. ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారానే తెలుగు సినిమా రంగంలో నేపథ్యగాయనిగా ప్రవేశించారు. ఒకే చిత్రం ద్వారా రామారావు, ఘంటసాల, పి.లీల వంటి ముగ్గురు లెజెండరీ పర్సన్స్ పరిచయమవడం విశేషం..
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!