Murari Movie: 21 ఏళ్ళ ‘మురారి’ గురించి మనకు తెలియని విషయాలు..!

  • February 17, 2022 / 01:07 PM IST

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ ఫ్యామిలీ నుండీ ఏ హీరో ఎంట్రీ ఇచ్చినా మొదటి సినిమా హిట్ ఉండాలని.. అభిమానులు కోరుకుంటారు. అందుకు తగినట్టే హిట్టు కొట్టాడు మహేష్. అయితే తరువాతి సినిమా యావరేజ్, మూడవ సినిమా అట్టర్ ప్లాప్ గా కావడంతో మహేష్ బాబు కెరీర్ కష్టాల్లో పడినట్టు అయ్యింది. ఆ టైములో తరువాతి సినిమాతో మహేష్ బాబు కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలి..

లేదంటే అనుకున్న స్థాయికి అతను రీచా అవ్వడం కష్టమైపోయేది..! అలాంటి టైములో ‘మురారి’ అనే క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీ చెయ్యడానికి మహేష్ ఓకే చెప్పాడు.ఈ సినిమా మొత్తం ‘చావు’ అనే థీమ్ తోనే సాగుతుంది. కృష్ణగారితో సహా.. ఇండస్ట్రీలో ఉన్నవారంతా మహేష్ తీసుకున్న డెసిషన్ కు తిట్టినవాళ్ళే..! ఈ టైములో అలాంటి కథతో సినిమా వద్దు అని కృష్ణగారు.. దర్శకుడు కృష్ణవంశీతో చెప్పారట. కానీ మహేష్ మాత్రం.. చేస్తే ఆ కథతోనే సినిమా చేస్తాను అని తేల్చి చెప్పేసాడు. సరే చాలా వాదోపవాదాల తరువాత సినిమా మొదలైంది. కిందా మీదా పడి సినిమాని ఫినిష్ చేశారు.

మధ్యలో దర్శకుడు కృష్ణవంశీ అలాగే నిర్మాతలు దేవి ప్రసాద్, రామ లింగేశ్వరరావు గారితో ఓ పాట విషయంలో కూడా మనస్పర్థలు వచ్చాయి. కృష్ణగారు రంగంలోకి దిగి దానిని కూడా సెట్ చేశారు. సినిమా ఫినిష్ అయ్యింది. 2001వ సంవత్సరం ఫిబ్రవరి 17న విడుదలయ్యింది ఈ చిత్రం. మొదటి షోతోనే ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. మెయిన్ గా కృష్ణగారి అభిమానులే ఇలాంటి టాక్ చెప్పారు. వారు కోరుకున్న అంశాలు సినిమాలో లేవు. అయితే క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ చెప్పడం మొదలుపెట్టారు. ఈవెనింగ్ షోలకి ఎక్కువ బుకింగ్స్ జరుగుతున్నాయి. మాస్ సెంటర్స్ లో కూడా ఈవెనింగ్ షోలకు పాజిటివ్ వాతావరణం ఏర్పడింది.

దాంతో కృష్ణగారు ఈవెనింగ్ షోకి వెళ్లి ఈ చిత్రాన్ని చూశారట. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి.. ఆశ్చర్యపోయారట. ఇక సినిమాలో మహేష్ బాబు నటన కూడా చాలా బాగుంది అని విమర్శకులు సైతం కామెంట్లు చెయ్యడంతో కృష్ణగారు అలాగే నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారట. మహేష్ బాబు కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ ఈ మూవీ. సిల్వర్ జూబ్లీ కూడా .! ఓ ప్రయోగంతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఒక్క మహేష్ బాబుకే చెల్లింది. ఫైనల్ గా అతని నమ్మకమే గెలిచింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 20ఏళ్ళు కావస్తోంది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ‘అలనాటి బాలచంద్రుడు’ అనే పాటని ఇప్పటికీ పెళ్లిళ్లలో వాడుతూనే ఉన్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus