Rana Daggubati: రానా దగ్గుబాటి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

  • December 14, 2022 / 12:22 PM IST

రానా దగ్గుబాటి.. తాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్.. తండ్రి ప్యాషనేట్ ప్రొడ్యూసర్.. బాబాయ్ టాప్ స్టార్.. సినిమా వాతావరణంలో పుట్టి పెరిగిన రానా.. ఆ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకునే స్థాయికి ఎదగడం ఇప్పటి యువతరానికి స్ఫూర్తి.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఈజీనే అయినా కానీ.. కొంత వరకు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నా.. స్వశక్తితోనే పైకొచ్చాడు.. డిసెంబర్ 14న రానా 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

బాల్యం – విద్యాభ్యాసం..

రామా నాయుడు పెద్ద కుమారుడు సురేష్ బాబు, లక్ష్మీల పెద్ద కొడుకు రానా.. తనకి చెల్లెలు మాళవిక, తమ్ముడు అభిరామ్ ఉన్నారు.. 1984 డిసెంబర్ 14న మద్రాసులో జన్మించాడు.. అక్కడి చెట్టినాడ్ విద్యాశ్రమం, హైదరాబాద్ నలందా విద్యా భవన్ హైస్కూలులో స్కూలింగ్, సెయింట్ మేరీస్‌లో కాలేజ్ కంప్లీట్ చేశాడు.. (బి.కామ్‌ తరువాత చెన్నై ఫిల్మ్ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో పట్టభద్రుడయ్యాడు).

స్పిరిట్ మీడియా యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సంస్థ..

స్పిరిట్ మీడియా అనే యానిమేషన్, వీఎఫ్ఎక్స్ సంస్థ స్థాపించాడు.. దాదాపు 70 సినిమాలకు పైగా ఈ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్ వర్క్ చేసింది.. మహేష్ బాబు ‘సైనికుడు’ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్టినేటర్‌గా పనిచేసిన రానా.. ‘బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్’ కేటగిరీలో నంది అవార్డు అందుకున్నాడు.. బాబాయ్ వెంకీ ‘లక్ష్మీ’ కి డిజిటల్ పోస్ట్ సూపర్ వైజర్‌గా ఉన్నాడు..

ప్యాషనేట్ ప్రొడ్యూసర్..

నిర్మాణం అనేది దగ్గుబాటి జీన్స్ లోనే ఉంది.. ‘బొమ్మలాట’ అనే బాలల చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించాడు.. ఆ సినిమాకి ‘బెస్ట్ ఫీచర్ ఫిలిం తెలుగు’ కేటగిరీలో నేషనల్ అవార్డ్ రావడం విశేషం.. ‘కేరాఫ్ కంచెరపాలెం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘777 చార్లీ’, ‘గార్గి’ సినిమాలకు సమర్పకుడిగా.. ‘విరాటపర్వం’ కి నిర్మాతగా వ్యవహరించాడు..

వాయిస్ ఓవర్ – నేరేటర్ & సింగర్..

‘ఇన్‌ ఫెర్నో’ (టామ్ హ్యాంక్స్), ‘అవెంజెర్స్ : ఇన్పినిటీ వార్’ & ‘అవెంజెర్స్ : ఎండ్ గేమ్’ (థానోస్), ‘ఆర్ఆర్ఆర్’ (రే స్టీవెన్ సన్), ‘విన్నర్’, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘లవ్ స్టోరీ’, ‘పొన్నియిన్ సెల్వన్ : 1’ వంటి చిత్రాలకు డబ్బింగ్, నేరేటర్ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.. అలాగే విశాల్ – తమన్నాల ‘యాక్షన్’ మూవీ కోసం ‘లైట్స్, కెమెరా, యాక్షన్’ అంటూ ర్యాప్ పాడాడు.. హోస్ట్‌గానూ ఆకట్టుకున్నాడు..

నెగిటివ్ రోల్స్..

‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ లో భల్లాల దేవుడిగా తన అసమాన నటనతో ప్రేక్షకాభిమానుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశాడు.. ఇక ‘భీమ్లా నాయక్’ లో డానియెల్ శేఖర్‌గా డైనమిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు..

డిఫరెంట్ జోనర్స్..

రానా కథల ఎంపిక పరంగా వైవిధ్యత చూపిస్తుంటాడు.. ఫస్ట్ ఫిలిం ‘లీడర్’ దగ్గరి నుండి.. ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘అరణ్య’ (హథీ మేరీ సాథీ), ‘విరాట పర్వం’.. ఇలా వేటికవే విభిన్నంగా ఉంటాయి.. క్యారెక్టర్ పరంగా నటనలో వైవిధ్యం చూపిస్తూ.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు..

బాబాయ్‌తో కలిసి..

ఫస్ట్ టైమ్.. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ మూవీలోని ‘బళ్లారి బావా’ పాటలో బాబాయ్ – అబ్బాయ్ కలిసి స్టెప్పులేశారు.. ఇప్పుడు ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో కలిసి నటిస్తున్నారు..

ప్రేమించి.. పెద్దలను ఒప్పించి..

తన ప్రియురాలు మిహికా బజాజ్‌ని 2020 ఆగస్టు 8న ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నాడు.. ఏ సెలబ్రిటీ కూడా తమ లోపాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ తన కంటి సమస్యను కూడా బయట పెట్టాడు.. ప్రేక్షకాభిమానుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించాడు.. చిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించుకున్న రానా దగ్గుబాటి జీవితం.. ఇప్పటి యువతరానికి స్పూర్తిదాయకం..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus