Dheekshith Shetty: ‘దసరా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి గురించి ఆసక్తికర విషయాలు… !

నాని హీరోగా తెరకెక్కిన ‘దసరా’ సినిమా మార్చి 30న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. రేపో మాపో రూ.100 కోట్ల క్లబ్ లో చేరబోతోంది ఈ చిత్రం. ‘దసరా’ తో నాని, కీర్తి సురేష్ లకు ఎంత పేరొచ్చిందో.. వీరితో సమానంగా దీక్షిత్ శెట్టికి కూడా పేరొచ్చిందని చెప్పాలి. ‘దసరా’ లో నానికి ప్రాణ స్నేహితుడిగా ఇతను కనిపిస్తాడు. సూరి అనే పాత్రలో దీక్షిత్ కూడా చాలా మాస్ గా కనిపించాడు.

ఓ రకంగా ఫస్ట్ హాఫ్ లో ఇతని రోల్ బాగా హైలెట్ అయ్యిందని కూడా చెప్పొచ్చు. ఇంటర్వెల్ బ్లాక్ లో నాని కంటే ఎక్కువగా ఫైట్ చేసింది దీక్షిత్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే ఇంటర్వెల్ సీన్ కు ఇతను కన్నీళ్లు కూడా పెట్టిస్తాడు అన్నది వాస్తవం. ధూమ్ ధామ్ సాంగ్ లో ఇతను హీరో నాని కంటే కూడా బాగా ఇంకా చెప్పాలంటే ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశాడు.

ఇదిలా ఉండగా.. దీక్షిత్ శెట్టి బ్యాక్ గ్రౌండ్ కూడా అందరికీ తెలుసు. కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే టాప్ హీరోగా (Dheekshith Shetty) ఎదుగుతున్నాడు ఇతను. తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన ‘దియా’ లో ఇతను కీలక పాత్ర పోషించాడు. అయితే చాలా మంది ‘దసరా’ సినిమా.. తెలుగులో ఇతనికి మొదటి చిత్రం అని అంతా అనుకున్నారు.

కానీ కాదు. గతంలో ఇతను రెండు తెలుగు సినిమాల్లో నటించాడు. ‘ముగ్గురు మొనగాళ్ళు'(2021) అనే మూవీలో ఇతను నటించాడు. అలాగే ‘ది రోజ్ విల్లా’ అనే సినిమాలో కూడా ఇతను నటించాడు. ఇక నాని నిర్మాణంలో రూపొందిన ‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus