సూపర్ హిట్ కామెడీ ఫిలిం ‘మధురా నగరిలో’ ఏ సినిమాకి రీమేక్ అంటే..?

శ్రీకాంత్ హీరోగా అప్పటికి గుర్తింపు తెచ్చుకోలేదు.. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తమ్ముడు.. యాక్టర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవి శంకర్, చిన్నా, రియాజ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో.. నిరోషా కథానాయికగా వచ్చిన క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘మధురా నగరిలో’.. ‘శివ’ సినిమాతో వచ్చిన ఫేమ్ కారణంగా అప్పటికి చిన్నా ఒక్కడే కొద్దో గొప్పో కాస్త గుర్తింపు ఉన్న యాక్టర్.. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ – డైరెక్టర్ కోడి రామకృష్ణల కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అప్పటికే బాలకృష్ణతో సూపర్ డూపర్ హిట్స్ తీశారు..

ఎస్. గోపాల్ రెడ్డి నిర్మాతగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో.. సురేష్ ముఖ్య పాత్ర, శరత్ బాబు కీలక పాత్రలో కనిపించిన ఫిలిం ‘మధురా నగరిలో’.. వై. విజయ, బాబూ మోహన్ వంటి వారు ఇతర క్యారెక్టర్లలో నటించారు.. సిద్దిక్ – లాల్ కధ, గణేష్ పాత్రో మాటలు, వెన్నెలకంటి పాటలు, ఎస్. బాలకృష్ణ సంగీతం, నాగూర్ బాబు (మనో), శ్రీ కుమార్ సింగర్స్.. ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు చిన్నపాటి థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా జనాలకు మెల్లగా ఎక్కింది..

‘ఒరేయ్ బుల్లెబ్బాయ్.. తేడా వచ్చింది లగెత్తరోయ్’ అంటూ శ్రీకాంత్.. చిన్నాతో చెప్పే డైలాగ్ బాగా పాపులర్.. ఇది మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘హరిహర నగర్’ మూవీకి అఫీషియల్ రీమేక్.. కొత్త వాళ్లతో అప్పటికే స్టార్ డమ్ ఉన్న నిర్మాత, దర్శకుడు చేసిన సాహసం ఈ సినిమా.. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించడం, తర్వాత వాళ్లు స్నేహితులుగా మారడం..

అనుకోకుండా వాళ్ల జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఇబ్బందుల్లో పడడం.. దాని నుండి బయట పడడం.. ఇలా సాగిపోతుంది సినిమా.. క్లైమాక్స్‌లో హీరోయిన్ ఊరు వదిలి వెళ్లిపోవడం.. అప్పుడు కూడా శ్రీకాంత్.. ‘ఒరేయ్ బుల్లెబ్బాయ్.. తేడాలొచ్చాయ్.. లగెత్తండిరోయ్’ అనడం.. ఓవరాల్‌గా ఏమీ ఆశించకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు మంచి ఫన్‌తో పాటు థ్రిల్‌ కలిగించింది ‘మధురా నగరిలో’..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus