‘జోష్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య.. మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.ఆ టైములో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏమాయ చేసావె’ స్టోరీ అతని వద్దకు వెళ్ళింది. ‘ఇందిరా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని ఈ చిత్రాన్ని నిర్మించింది. నిజానికి ఈ చిత్రాన్ని మొదట మహేష్ బాబుతోనే రూపొందించాలని ఆమె అనుకుంది.అప్పటి రోజుల్లోనే రూ.25కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకుంది. ఇది ‘పోకిరి’ కి ముందు మాట.
కానీ ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ అవ్వడం.. ఆ తరువాత మహేష్ స్టార్ డం రెండింతలు పెరగడంతో లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ‘ఏమాయ చేసావె’ స్క్రిప్ట్ ను కొన్నేళ్ల పాటు హోల్డ్ లో కూడా పెట్టారట. ఫైనల్ గా అది నాగ చైతన్య ఓకే చేసాడట. మొదట ఈ స్క్రిప్ట్ కు నాగార్జున నొ చెప్పారట. కానీ చైతన్య పట్టుబట్టి ఓకే చేయించుకున్నాడని తెలుస్తుంది. అలా ఈ చిత్రాన్ని రూ.10కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేసారని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రం క్లైమాక్స్ విషయంలో దర్శకుడు గౌతమ్ మేనన్ కు అలాగే నిర్మాత మంజులకు చాలా డిస్కషన్లు జరిగాయట.
ఇదే చిత్రాన్ని తమిళ్ లో కూడా తెరకెక్కించాడు గౌతమ్. అక్కడ శింబు,త్రిష లు నటించారు. అక్కడి క్లైమాక్స్ లో హీరో, హీరోయిన్లకు పెళ్ళవ్వదు. కానీ తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారు పెళ్లి చేసుకున్నట్టు క్లైమాక్స్ మార్చారు. ఇక రియల్ లైఫ్ లో కూడా చైసామ్ లు అలాగే వివాహం చేసుకున్నారు. అసలు ఈ సినిమా గురించి ఇంత కథ ఇప్పుడెందుకంటే.. ఈరోజుతో ఈ చిత్రం విడుదలయ్యి 11 ఏళ్ళు పూర్తికావస్తోంది. 2010 ఫిబ్రవరి 26న ఈ చిత్రం విడుదలయ్యింది.