బాలయ్య షో తర్వాత ఎపిసోడ్ కు వాళ్లను పిలుస్తున్నారా?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఫస్ట్ సీజన్ స్థాయిలో సెకండ్ సీజన్ కు రెస్పాన్స్ రాలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎపిసోడ్ ఎపిసోడ్ కు గ్యాప్ వస్తుండటం కూడా ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. ఈ శుక్రవారం కూడా కొత్త ఎపిసోడ్ లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే బాలయ్య షో తర్వాత ఎపిసోడ్ కు అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్ర రావు గెస్ట్ లుగా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.

స్టార్ ప్రొడ్యూసర్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న సురేష్ బాబు, అల్లు అరవింద్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రాఘవేంద్రరావు ఈ షోలో ఎలాంటి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటారో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య షోకు క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను పిలిస్తే ఈ షోకు మరింత మంచి రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, కమల్ హాసన్, రిషబ్ శెట్టి, క్రేజ్ ఉన్న ఇతర సెలబ్రిటీలు హాజరైతే ఈ షో రేంజ్ కచ్చితంగా పెరుగుతుందని చెప్పవచ్చు.

ఈ దిశగా బాలయ్య అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. అన్ స్టాపబుల్ షో కోసం 20 నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ షో నిర్వాహకులు ఖర్చు చేస్తున్నారు. ఆహా ఓటీటీకి అంతకంతకూ రెస్పాన్స్ పెరుగుతుండగా బాలయ్య షో వల్ల అహా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు పెరిగాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాలయ్య కూడా ఈ షోకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య షో ఆహా ఓటీటీ రేంజ్ ను పెంచిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus