మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈమె మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చారు. మెగా వారసురాలు అడుగు పెట్టడంతో సాక్షాత్తు మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు అంటూ అపోలో హాస్పిటల్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ క్రమంలోని ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాసన రాంచరణ్ దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్ళై పది సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు కలగకపోవడంతో అభిమానులు ఉపాసన శుభవార్తను ఎప్పుడూ చెబుతారా అంటూ ఎదురు చూశారు అయితే గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఉపాసన రాంచరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని శుభవార్తను తెలియజేశారు.
ఈ క్రమంలోనే ఉపాసన తల్లి కాబోతున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇక ఈమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునేవారు. అయితే ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఉపాసన బిడ్డకు జన్మనిచ్చారనే విషయం తెలిసి అభిమానులు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.