రాంచరణ్ సతీమణి … మెగాస్టార్ చిరంజీవి కోడలైన ఉపాసన రియల్ లైఫ్ లో హీరోయిన్ అనిపించుకుంటుంది. తన కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా ఎంతో శుభ్రతగా ఉంచుకోవాలని తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఓ పక్క తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే.. మరోపక్క ఆరోగ్యకరమైన రెసిపీస్ మరియు హెల్ది జ్యూస్ ల గురించి ప్రేక్షకులకు చెబుతూ ఉంటుంది. ఇక అపోలో ఆసుపత్రిలో కూడా కీలక బాధ్యతలను స్వీకరిస్తూ… ఆ బాధ్యతలను కూడా నూటికి నూరు శాతం నిర్వర్తిస్తూ ఉంటుంది.
అసలు ‘ఈమెకు ఇంత ఓపిక ఎక్కడి నుండీ వస్తుంది’ అనేంతలా ఈమె చేసే పనులుంటాయి. మొన్నటికి మొన్న టాయిలెట్ పొజిషన్ ఎలా ఉండాలో చూపించి.. ఈమె గట్స్ ఏంటన్నది పరిచయం చేసింది. అటు తరువాత ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకుంటున్నట్టు కూడా చెప్పి చేతితో పేడను పట్టుకుని.. ఏమాత్రం నామోషీ ఫీలింగ్ లేకుండా ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ అమ్మడు ఎవ్వరూ చెయ్యలేని ప్రయోగం చేసి.. హాట్ టాపిక్ గా నిలిచింది.
డిఫెక్టేడ్ కండోమ్స్ తో చేసిన ఓ డ్రెస్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్థానిక డిజైనర్లు రిజెక్ట్ చేసిన టెక్స్ టైల్స్ స్క్రాప్ ను కూడా ఈ డ్రెస్ కోసం ఉపయోగించారట. ‘పనికిరానివి అంటూ ఏమీ ఉండవు… అన్నీ ఉపయోగపడేవే’ అంటూ కామెంట్ కూడా పెట్టింది.ఈమె గట్స్ కి నెటిజన్లు ప్రశంసలు పలుకుతున్నారు.
View this post on Instagram
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on
Most Recommended Video
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్