Upasana: మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న మెగా కోడలు.. ఉపాసన లేటెస్ట్ ఫోటో వైరల్!

సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మెగా కుటుంబంలో హీరోలకు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీకి కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పాలి ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు హీరోయిన్ రేంజ్ ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. మెగా అభిమానులందరూ ఉపాసనని వదినమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతుంది అన్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఉపాసనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇక ఉపాసన తల్లి కాబోతున్నారని తెలిసినప్పటి నుంచి ఈమె కూడా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈమె ఓ పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఉపాసన బేబీ బంప్ ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే ప్రెగ్నెన్సీగా ఉన్న మహిళలకు ఇష్టమైన ఆహారాన్ని తినాలనిపిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఉపాసనకు కూడా అలాంటి ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కలిగాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె జంక్ ఫుడ్ తింటున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇలా ఉపాసన తల్లి కాబోతుండడంతో తన మాతృత్వపు క్షణాలను ఎంతో ఆస్వాదిస్తుందని ఈ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది.

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ పై పలువురు నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు. జాగ్రత్త వదినమ్మ ఏది పడితే అది తినకండి అంటూ సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus