మెగా కోడలు ఉపాసన (Upasana) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూల్ గా కనిపించే ఉపాసన తాజాగా ఒక సీరియస్ పోస్ట్ ద్వారా వార్తల్లో నిలవగా ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కోల్ కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన గురించి ఉపాసన స్పందిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మానవత్వం లేకపోవడం చూస్తుంటే అసహ్యంగా ఉందని ఆమె అన్నారు.
Upasana
మహిళా వైద్యురాలిపై ఇలాంటి ఘటన జరగడం దారుణం అని ఉపాసన చెప్పుకొచ్చారు. దీన్ని ఎవరూ సహించరని జీవితానికి గౌరవం ఎక్కడుందని ఉపాసన కామెంట్లు చేశారు. మన సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతుంటే స్వాతంత్ర్యం జరుపుకోవాలా అని ఉపాసన అభిప్రాయపడ్డారు. ఆ అమ్మాయి విషయంలో అలా ప్రవర్తించిన వ్యక్తి నా దృష్టిలో మనిషే కాడని ఉపాసన పేర్కొన్నారు. మన దేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారని ఉపాసన పేర్కొన్నారు.
శ్రామిక శక్తిలో మహిళలు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నారని ఆమె అన్నారు. ఎక్కువమంది మహిళలను వర్క్ ఫోర్స్ లోకి తీసుకొనిరావడమే నా లక్ష్యం అని ఉపాసన వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణలో వాళ్ల సహకారం ముఖ్యమైనదని ఉపాసన పేర్కొన్నారు. కోల్ కతా ఘటన నాలో సంకల్పాన్ని మరింత బలపరిచిందని ఉపాసన వెల్లడించారు. ప్రతి స్త్రీకి భద్రత, గౌరవం అవసరమని మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకొనిరావచ్చని ఉపాసన పేర్కొన్నారు.
ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కోల్ కతా ఘటన ఉపాసనను ఎంతో హర్ట్ చేసిందని అందుకే ఆమె ఇంత ఘాటుగా రియాక్ట్ అయ్యి ఉండవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉపాసన చేసిన కామెంట్లకు నెటిజన్ల నుంచి కూడా సపోర్ట్ లభిస్తుండటం గమనార్హం.