మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) , స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ కాంబోలో వచ్చిన ‘మిరపకాయ్’ (Mirapakay) మంచి సక్సెస్ అందుకుంది. దాని తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) . ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహ నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
Mr Bachchan
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి కూడా అభిమానుల్ని, ప్రేక్షకులను మెప్పించాయి. అందువల్ల ‘మిస్టర్ బచ్చన్’ కి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) చిత్రానికి రూ.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.34 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కాంబినేషనల్ క్రేజ్ ఉంది కాబట్టి.. మినిమమ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. పైగా 4 రోజులు హాలిడేస్ కూడా ఉన్నాయి. కానీ మరోపక్క పోటీగా మరో 3 క్రేజీ సినిమాలు కూడా ఉండటం కొంత కలవరపరిచే విషయం.