Upasana, Ram Charan: ఆ విషయాల్లో చరణ్ క్లీంకార సేమ్.. ఉపాసన కామెంట్స్ వైరల్!
- May 14, 2024 / 04:25 PM ISTByFilmy Focus
మెగా కోడలు ఉపాసన రామ్ చరణ్ (Ram Charan) గురించి ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణమని కానీ అది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని ఉపాసన తెలిపారు. ప్రసవానంతర డిప్రెషన్ ను తక్కువగా తీసుకోవద్దని ఆమె చెప్పుకొచ్చారు. అవసరమైతే నిపుణులను సంప్రదించి దాని నుంచి బయటపడాలని ఉపాసన కామెంట్లు చేశారు. చాలామందిలా నేను కూడా డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని ఆ సమయంలో రామ్ చరణ్ సపోర్ట్ ఇచ్చారని ఉపాసన పేర్కొన్నారు.
నాతో పాటు చరణ్ మా పుట్టింటికి వచ్చారని అందరికీ అలాంటి అదృష్టం ఉండదని ఆమె తెలిపారు. క్లీంకార విషయంలో రామ్ చరణ్ చూపించే శ్రద్ధ చూస్తే ముచ్చటేస్తుందని ఆమె తెలిపారు. లైఫ్ లో నేను తల్లిగా ఎదుగుతున్న దశను చరణ్ మరింత సుసంపన్నం చేసినట్టు అనిపిస్తుందని ఉపాసన పేర్కొన్నారు. క్లీంకార చాలా విషయాలలో తన తండ్రిని తలపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

క్లీంకార ఆహారపు అలవాట్లు సైతం రామ్ చరణ్ అలవాట్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ బెస్ట్ థెరపిస్ట్ అని ఉపాసన చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చరణ్ గురించి ఉపాసన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ (Game changer) దసరా పండుగ కానుకగా విడుదల కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మొదట దేవర (Devara) విడుదల కానుందని ఆ తర్వాత గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. రెండు వారాల గ్యాప్ లో రెండు సినిమాలు విడుదలైతే ఏ సినిమాకు ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహ బంధం కలకాలం కొనసాగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

















