Upasana: ఆ విషయంలో ఉపాసన గ్రేట్ అంటున్న ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్యగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో ఉపాసన మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న ఉపాసన తాజాగా తీసుకున్న నిర్ణయం గురించి అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అపోలో హాస్పిటల్స్ నెట్వర్క్ లో వన్యప్రాణి సంరక్షణ చట్టం కొరకు పని చేసే వాళ్లకు, ఫారెస్ట్ గార్డులకు ఫ్రీగా చికిత్స, వైద్య సంరక్షణ అందిస్తానని ఉపాసన వెల్లడించారు.

తన మనస్సు గొప్ప మనస్సు అని ఈ నిర్ణయం ద్వారా ఉపాసన ప్రూవ్ చేసుకున్నారు. ఫారెస్ట్ సిబ్బందికి ప్రయోజనం చేకూరేలా ఉపాసన తీసుకున్న డెసిషన్ ను ఫారెస్ట్ సిబ్బంది మెచ్చుకుంటున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించడం అంటే సాధారణ విషయం కాదనే సంగతి తెలిసిందే. వ్యాపారవేత్తగా పలు వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తూ ఎంతోమంది మహిళలకు ఉపాసన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాసన చరణ్ సినిమాల కథల విషయంలో,

ఇతర వ్యవహారాల విషయంలో జోక్యం చేసుకోకపోయినా చరణ్ సినిమా రిలీజైతే ఆ సినిమాను థియేటర్ లో చూసి అభిప్రాయాలను పంచుకుంటారు. పెళ్లి తర్వాత చరణ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య రిలీజ్ కానున్న నేపథ్యంలో చరణ్ శంకర్ కాంబో మూవీ సమ్మర్ కానుకగా రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.

శంకర్ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus