సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ చిత్రం విడుదలయ్యి 14రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తుంది.కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి.
దాంతో 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ చిత్రం 14 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 14.07 cr |
సీడెడ్ | 6.95 cr |
ఉత్తరాంధ్ర | 7.90 cr |
ఈస్ట్ | 4.55 cr |
వెస్ట్ | 2.44 cr |
గుంటూరు | 2.73 cr |
కృష్ణా | 2.89 cr |
నెల్లూరు | 1.61 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 43.14 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.20 cr |
ఓవర్సీస్ | 1.32 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 46.66 cr (షేర్) |
‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక 14 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఏకంగా 46.66 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో 25.66 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం. రెండో గురువారం నాడు కూడా ఈ చిత్రం 0.39 కోట్ల షేర్ ను రాబట్టింది. చూస్తుంటే.. ఈ వీకెండ్ ను కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకునేలా ఉంది అనే చెప్పాలి.
Click Here To Read Movie Review
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!