వినాయక చవితి కానుకగా ఇప్పటికే ‘ది గోట్’ ’35 – చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటి రిజల్ట్ ఏంటో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక పండుగ రోజు నాడు ‘ఉరుకు పటేలా’ (Uruku Patela) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం రండి :
Uruku Patela Review
కథ : పటేలా(తేజస్ కంచర్ల) (Tejus Kancherla) 7వ తరగతికే చదువుకు స్వస్తి చెప్పేస్తాడు.అతను ఊరి సర్పంచ్ రామరాజు (గోపరాజు రమణ) (Goparaju Ramana) కొడుకు కాబట్టి..బాగా ఆస్తి కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ఏ చదువుకున్న అమ్మాయి అయినా ‘నన్ను పెళ్లి చేసుకోవడానికి’ ఒప్పుకుంటుంది అనేది ఇతని ధీమా. కానీ పటేలాని పెళ్లి చేసుకోవడానికి చదువుకున్న అమ్మాయిలు ఎవ్వరూ ముందుకు రారు.ఈ క్రమంలో అతనికి డాక్టర్ అక్షర (ఖుష్బూ చౌదరి) (Khushboo Choudhary) పరిచయమవుతుంది. తొలి చూపులోనే పటేలా ఆమెను ప్రేమిస్తాడు. అందుకు తండ్రి రామరాజు కూడా అతనికి సాయపడతాడు.
ఆ తర్వాత ఆమె కూడా పటేలాని ప్రేమిస్తుంది. ఓ యాక్సిడెంట్లో అక్షరని కాపాడబోయి పటేలా ఓ కాలు పోగొట్టుకుంటాడు.ఆ తర్వాత అతన్ని హీరోయిన్ అండ్ ఫ్యామిలీ ఓ హాస్పిటల్ కి పిలిచి చంపాలనుకుంటారు. అందుకు కారణాలు ఏంటి? పటేలా హీరోయిన్ అండ్ ఫ్యామిలీ నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : తేజస్ కంచెర్ల 5 ఏళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టైటిల్ రోల్లో పర్వాలేదు అనిపించాడు. కుష్బూ చౌదరి తన లుక్స్ తో ఆకట్టుకుంది. నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. మితిమీరిన ఎక్స్పోజింగ్ కి ఈ సినిమాలో ఆమె దూరంగా ఉండటం అనేది చెప్పుకోదగ్గ విషయం. గోపరాజు రమణ ఎప్పటిలానే తన హానెస్ట్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. చమ్మక్ చంద్ర (Chammak Chandra) కామెడీ పెద్దగా కనెక్ట్ కాదు. అతని పాత్ర ఎంట్రీకి..
తర్వాత వచ్చే సన్నివేశాల్లో అతని నటనకు సింక్ ఉండదు. సుదర్శన్ తన మార్క్ కామెడీతో పర్వాలేదు అనిపిస్తాడు. హీరో ఫ్రెండ్ గా చేసిన కృష్ణ కౌండిన్య పర్వాలేదు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ కి మాత్రమే అతని పాత్ర పరిమితమైంది. మిగిలిన వాళ్ళ పాత్రలు సో సోగా ఉన్నాయి.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘ఉరుకు పటేలా’ (Uruku Patela) ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. ఓ డిఫరెంట్ థ్రిల్లర్ చూడబోతున్నామేమో, ఇందులో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయేమో అనే ఫీలింగ్ కలిగించాయి. హారర్ సంగతి పక్కన పెడితే ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి పూర్తిగా మిస్ అయ్యాయి. దర్శకుడు వివేక్ రెడ్డి (Vivek Reddy) మంచి లైన్ అనుకున్నాడు. లవ్, ఫాదర్ సెంటిమెంట్, మూఢనమ్మకాలు…ఇలా అన్ని ఎలిమెంట్స్ తో ఆ లైన్ ఉంటుంది. కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం.. వీక్ స్క్రీన్ ప్లే కారణంగా సినిమా ఆసక్తిగా సాగదు. ఫస్ట్ హాఫ్ అంతా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కామెడీ ప్రజెంట్ చేసే ప్రయత్నం దర్శకుడు చేశాడు.
ఇంటర్వెల్ సీక్వెన్స్ అందరిలో క్యూరియాసిటీ పెంచుతుంది. సెకండాఫ్ పై ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంది. కానీ సెకండాఫ్ స్టార్ట్ అయిన కాసేపటికే మిగిలిన కథ ట్విస్ట్..లు అన్నీ ముందుగానే అంచనా వేసే విధంగా ఉంటాయి. క్లైమాక్స్ వద్ద వచ్చే ట్విస్ట్..లు కూడా సాగదీసినట్టు ఉన్నాయి కానీ థ్రిల్ చేసే విధంగా లేవు. మ్యూజిక్ పరంగా చూసుకుంటే ప్రవీణ్ లక్కరాజు (Praveen Lakkaraju) న్యాయం చేశాడు. రెండు పాటలు బాగున్నాయి. మనకి వినే మూడ్ లేకపోయినా అవి సెల్ ఫోన్ వంక చూడకుండా చేశాయి. సన్నీ కూరపాటి (Sunny Kurapati) సినిమాటోగ్రఫీకి కూడా మంచి మార్కులు వేయొచ్చు. నిర్మాతలు కథకు తగ్గట్టు బాగానే ఖర్చు పెట్టారు.
విశ్లేషణ : ‘ఉరుకు పటేలా’ (Uruku Patela) ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మెప్పిస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో ఆశించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం, వీక్ స్క్రీన్ ప్లే కారణంగా రెగ్యులర్ ఆడియన్స్ ని కూడా విసిగిస్తుంది.
ఫోకస్ పాయింట్ : థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులు.. బయటకు ఉరికేలా…!