ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) .. టాలీవుడ్‌లో ఐటెం సాంగ్‌లకు గ్లామర్ మార్క్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’లో (Waltair Veerayya) బాస్ పార్టీ, బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్’లో (Daaku Maharaaj) దబిడి దిబిడి లాంటి మాస్ సాంగ్స్ ద్వారా ఆమెను తెలుగు ఆడియన్స్ గుర్తుంచుకున్నారు. ఈ పాటలకు వచ్చిన రెస్పాన్స్ ఆమెకు టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్ అంటే మొదట ఊర్వశి పేరు వినిపించడమేకాదు, ఆమె పారితోషికం కూడా టాప్ లెవల్లో ఉండటం మరో ఆకర్షణ.
ఐటెం సాంగ్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా ఛాన్స్ దక్కించాలని ఆమె బలంగా కోరుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి తనపై ఎంతో విశ్వాసం ఉన్నట్టు చెప్పారు. టాలీవుడ్‌లో తానే మోస్ట్ వాంటెడ్ ఐటెం స్టార్ అని చెప్పడమే కాకుండా, చాలా మంది దర్శకులు తనను సంప్రదిస్తున్నారని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కానీ డాకు మహారాజ్ తర్వాత ఆమెకు సరైన ఛాన్స్ రాలేదు.
ప్రస్తుతం ‘బ్లాక్ రోజ్’ అనే సినిమాలో నటిస్తున్న ఊర్వశి ఆ ప్రాజెక్ట్ పూర్తికావడం ఆలస్యం కావడంతో ఆమెపై అంచనాల్ని తగ్గించుకుంది. అయినప్పటికీ, టాలీవుడ్ మీద ఉన్న ఆశను మాత్రం ఆమె వదిలిపెట్టలేదు. ఐటెం సాంగ్స్‌కు మాత్రమే కాకుండా, హీరోయిన్‌గా కూడా అవకాశాలు రావాలని ఆమె కోరుకుంటోంది. హిందీలో రెండు సినిమాలు చేసినా, దాని కంటే టాలీవుడ్‌పైనే ఆమె ఆసక్తి ఎక్కువగా ఉంది.
బాలీవుడ్‌లో 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రంతో పరిచయమైన ఊర్వశి, పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌లతో పాటు మ్యూజిక్ వీడియోలతో పాపులారిటీ సంపాదించింది. తమిళంలో ‘ది లెజెండ్’ వంటి సినిమాల్లో నటించి అక్కడి మార్కెట్‌ను టచ్ చేసింది. కానీ ప్రస్తుతం మాత్రం తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెంచిందని స్పష్టంగా తెలుస్తోంది. ఊర్వశికి క్రేజ్ ఉన్నా.. అది హీరోయిన్‌గా నిలబెట్టే స్థాయిలో ఉన్నదా అనేది అసలు ప్రశ్నే. మరి అమ్మడు లక్కు ఎలా సాగుతుందో చూడాలి.